ఈ నెల 28న నల్గొండలో బీఆర్ఎస్ (BRS) రైతు మహా ధర్నా నిర్వహించనుంది. అయితే.. ఈ నెల 21న నల్గొండలో రైతు మహా ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునివ్వగా.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్‌ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ)న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఈరోజు.. ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.
KTR : రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ధర్నాకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ధర్నా ప్రతిపాదిత స్థలం హైవే వెంట ఉండటం, జిల్లాలో గ్రామసభలు జరుగుతుండడం, సంక్రాంతి హడావిడి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఇవ్వలేమని బీఆర్ఎస్ పార్టీకి తేల్చి చెప్పారు పోలీసులు. రేపటి మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్…
నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుర్రంపోడు మండలం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్.. అనధికారికంగా విధులకు గైహాజరైన సిబ్బందిని సస్పెండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఫార్మాసిస్ట్, ల్యాబ్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్‌ను ఉద్యోగాల నుంచి తొలగించారు. అలానే ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం…
Nalgonda Intelligence SP: నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ ఆఫీసుకి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణలతో ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఉమ్మడి నల్గొండ జిల్లా సాగు నీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏడాదికి కిలోమీటరు సొరంగం తవ్వినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి అయ్యేదన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించామని ఆయన వెల్లడించారు.
CM Revanth Reddy: నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Samagra Kutumba Survey: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రస్తుతానికి 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇకపోతే, ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488…
కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ (కేంద్ర విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ) సమావేశానికి స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి.. భీమలింగంకు పూజలు చేశారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.
తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ పోలీసులు (ఏడీజీపీ) తమ సహోద్యోగులలో 39 మందిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ 12వ బెటాలియన్కు చెందిన తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) కానిస్టేబుళ్లు నిరసన తెలిపారు. సస్పెండ్ చేసిన తమ సహోద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 27 ఆదివారం నల్గొండ జిల్లాలో నిరసన కార్యక్రమం జరిగింది. తమ ఫిర్యాదులను అధికారులు పరిష్కరించడం లేదని భావించిన పోలీసు యంత్రాంగంలో పెరుగుతున్న అసంతృప్తిని ఈ నిరసన హైలైట్ చేసింది. తమ…