ఒకప్పుడు కాంగ్రెస్‌కు నల్లగొండ జిల్లా కంచుకోట. ఉద్దండులైన నాయకులు ఉన్నారక్కడ. పార్టీ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లాకు పెద్దపీట వేసేవారు. ప్రస్తుతం ప్రకటించిన పీసీసీలో జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. ఎందుకీ పరిస్థితి? సీనియర్లు ఉన్నా.. ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? పీసీసీలో ఉమ్మడి నల్లగొండజిల్లాకు దక్కని ప్రాధాన్యం! దిగ్గజ కాంగ్రెస్ నాయకులు ఉన్న జిల్లా ఉమ్మడి నల్లగొండ. పార్టీకి బలమైన నాయకత్వం.. కేడర్ ఉండేది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు ఎంపీలు కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. ఔట్‌గోయింగ్ పీసీసీ ప్రెసిడెంట్…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా కోవిడ్ టీకాలను వేగంగా అమలుచేస్తున్నారు. టీకా వేయించుకుంటే కరోనా బారినుంచి బయటపడే అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు, ఇతర సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయితే, వ్యాక్సినేషన్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కోవిడ్ టీకా వేయించుకోవడానికి వెళ్లిన ఓ మహిళకు, ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని బొల్లేపల్లిలో జరిగింది. Read: అజిత్ అభిమానులా మజాకా……
బీహార్ కు చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎంల వద్ద సహాయం చేస్తున్నట్టు నటించి భాదితుల వద్ద ఏటీఎం పిన్ నెంబర్లను ఈ ముఠా సేకరిస్తుంది. పిన్ నెంబర్ సహాయంతో ‘స్మార్ట్ మ్యాగ్నేట్’ మిషన్ ద్వారా అకౌంట్ లోని డబ్బులు మాయం చేస్తున్నారు జాదూగాళ్ళు. ఈ తరహాలో నల్గొండ జిల్లాలో 15 నేరాలకు పాల్పడినట్లు ముఠా సభ్యులు తెలిపారు. నిందితుల నుంచి రూ 5 లక్షల నగదు, ల్యాప్ ట్యాప్,…
నేడు నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనుంది. పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. మిర్యాలగూడ లోని బంగారు గడ్డలో సలీం కుటుంబానికి పరామర్శించనున్నారు. మేడారంలో ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని ఆత్మహత్యా యత్నం చేసిన నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం హుజుర్ నగర్ లో వై ఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల… కోదాడ సమీపంలోని దొండపాడులో మహానేత వైఎస్‌ఆర్ గారి అనుచరుడు, కుటుంబ…
తెలంగాణలో కొత్త లాక్‌డౌన్ సడలింపులు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.. కానీ, కేసుల తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉండగా.. ఇంకా పాజిటివ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఉన్నాయి.. అయితే, రెండు జిల్లాలను కలుపుతూ ఉన్న ఒక పంచాయతీలో మాత్రం.. రెండు లాక్‌డౌన్‌లు అమలు చేయాల్సిన పరిస్థితి..…
ఇంతకుముందులా కరోనా సోకిన పేషెంట్లు.. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండటం లేదు. చాలా మంది వ్యక్తులు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. భౌతిక దూరం కూడా పాటించడం లేదు. కరోనా సోకినా కూడా బయటకు వస్తున్నారు. మరికొందరైతే తన వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కోవిడ్ పాజిటివ్ పేషెంట్ లు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. ఓ మహిళ కు కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో…