Minister Komatireddy: నల్లగొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు.. పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్ లు కోల్పోయారు అని మండిపడ్డారు. కేటీఆర్ కు SLBC ఎక్కడుందో కూడా తెలియదు అన్నారు. ప్రభాకర్ రావును విదేశాల్లో దాచిపెట్టింది బీఆర్ఎస్ అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేయరు.. అమెరికాకు పారిపోవాల్సిన అవసరం కాంగ్రెస్ నేతలకు రాదని చెప్పుకొచ్చారు.
Read Also: Anchor Shyamala: ముగిసిన యాంకర్ శ్యామల విచారణ
ఇక, బీఆర్ఎస్ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు ఎస్ఎల్బీసీ లో ప్రమాదం బాధాకరం..10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ తమ ఉనికి కోల్పోతుందని తెలిపారు. ధాన్యం కొనుగొళ్లు పూర్తైన రెండు, మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి.. రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.. బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే సాగునీటి కష్టాలు తప్పేవి అని మంత్రి వెంకట్ రెడ్డి అన్నారు.