Women Died with Heart Attack while boarding the Plane in Chandigarh: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయణపురం సర్పంచి కె నర్సింహా భార్య ఇందిరాబాయి (48) ఛండీగఢ్‌లో మరణించారు. డ్వాక్రా ఉద్యోగిని అయిన ఇందిరాబాయి ఛండీగఢ్‌లో విమానం ఎక్కే క్రమంలో గుండెపోటు రావడంతో శుక్రవారం మృతి చెందారు. ఇందిరాబాయి మృతదేహాన్ని చిన్ననారాయణపురానికి తరలించడానికి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి మృతదేహం ఆమె స్వగ్రామానికి చేరుకోగా.. సోమవారం అంత్యక్రియలు…
నాకు మద్దతు ఇవ్వండి.. 20 ఏండ్లు నల్గొండను ప్రశాంతంగా అభివృద్ధి చేసుకుందాం అని పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చే వారికి మాటిస్తున్నాను.. వచ్చే ఐదేళ్లు మీ సేవలో ఉంటా.. ఐదోసారి ఓడిపోయినా.. భువనగిరి ఎంపీగా గెలిపించారు అంటూ కోమటిరెడ్డి తెలిపారు.
Villagers tried to stop MLA Kancharla Bhupal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మరోసారి నిరసన సెగ తగిలింది. నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను గ్రామంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గృహలక్ష్మి, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు అవకాశం కల్పించారని కంచనపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుకున్న కంచర్ల భూపాల్ రెడ్డి గ్రామంలో అడుగుపెట్టకుండానే వెనక్కి వెళ్లిపోయారు. గృహలక్ష్మి, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలో…
ఖమ్మం వెళ్తూన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నల్గొండ జిల్లా నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని డబ్బు సంచుల్ని దాచుకుంటుంది అని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు.. కానీ, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తరువాత కేటీఆర్ మాత్రమే సీఎం అవుతారు అని ఆయన విమర్శించారు. మన లక్ష్యం సీఎం పదవి కావొద్దు.. ఎప్పుడో ఒకసారి నేనూ కూడా సీఎం అవుతా.. పదవుల మీద నాకు ఆశ లేదు.. ఆశ ఉంటే ఆనాడు మంత్రి పదవి వదిలి పెట్టే వాడిది కాదు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీలో వేముల వీరేషం జాయిన్ అయిన తర్వాత ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నకిరేకల్ నేతల ముందు ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యపై హాట్ కామెంట్స్ చేశారు. మేము దగ్గరుండి గెలిపిస్తే.. మమ్మల్ని దారుణంగా మాట్లాడుతుండు.. మేము ఫస్ట్ జడ్పీటీసీగా గెలిపిస్తే.. పెద్ద పదవి ఎందుకు అన్నాడు.
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు పాలు అయ్యాడు.. తప్పు చేసింది ఎవరైనా సరే జైలుకు వెళ్ళక తప్పదు సీఎం కేసీఆర్ కు ఆది మినహాయింపు కాదు అని ఆయన వ్యాఖ్యనించారు.
నల్లగొండ జిల్లాలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. మా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. సలహాలు, సూచనల వరకే పరిమితం అవుతాను.. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.. పార్టీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండటం సహజం.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు వ్యవసాయ క్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు. వారం పది రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు.