Villagers tried to stop MLA Kancharla Bhupal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మరోసారి నిరసన సెగ తగిలింది. నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను గ్రామంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గృహలక్ష్మి, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు అవకాశం కల్పించారని కంచనపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుకున్న కంచర్ల భూపాల్ రెడ్డి గ్రామంలో అడుగుపెట్టకుండానే వెనక్కి వెళ్లిపోయారు.
గృహలక్ష్మి, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు అవకాశం కల్పించడంతో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై కంచనపల్లి గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారు. ఎమ్మెల్యే తమ గ్రామంలోకి వస్తున్నారని తెలుకున్న జనాలు.. అతడిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. గ్రామంలో అడుగుపెట్టకుండానే తిరిగి వెళ్లిపోయారు.
Also Read: Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి హైకోర్టులో ఊరట!
కొద్దిరోజుల క్రితం కనగల్లు మండలం అమ్మగూడెం గ్రామంలో కూడా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేకు సంబంధించిన కొందరు అనుచరులు గ్రామంలో దాడులకు పాల్పడుతున్నారని గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన గ్రామస్తులు.. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. చివరకు ఎమ్మెల్యే నిరాశగా వెనుదిరిగారు.