నల్లగొండ జిల్లాలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. మా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. సలహాలు, సూచనల వరకే పరిమితం అవుతాను.. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.. పార్టీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండటం సహజం.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే అభ్యర్థులను గెలిపించాలి అని ఆయన అన్నారు. అందర్నీ కలుపుకు పోయే బాధ్యత పోటీ చేసే అభ్యర్థుల మీద ఉంది.. కొంత మంది నేనే చెప్పే సలహాలు నచ్చక నాపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయని మండలి ఛైర్మన్ గుత్తా తెలిపారు.
Read Also: Lifestyle : మగవాళ్ళు పెళ్లి విషయంలో ఎందుకు భయపడతారో తెలుసా?
నేనేవరి పనుల్లో జోక్యం చేసుకొను.. గౌరవ ప్రదమైన బాధ్యతల్లో ఉన్నాను అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గౌరవ ప్రధంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ఆయన అన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్స్ అన్నీ ఆచరణ యోగ్యత కానివి.. అహంకారం, అహంభావంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటే నష్టపోయేది ఆ నాయకులే అని గుత్తా పేర్కొన్నారు. కులాలకు, మతాలకు ఓట్లు రాలవు.. తమ మధ్య ఉండే సమస్యలను కొంత మంది నేతలు కులాలకు ఆపాదిస్తున్నారు అని మండలి ఛైర్మన్ తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధే.. తెలంగాణ మరోసారి సీఎం చేసేందుకు దోహద పడతాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చిన ప్రజలకు కేసీఆర్ వైపే ఉన్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.
Read Also: Vijay Deverakonda: ధనం మూలం ఇదం జగత్.. డబ్బే అన్నీ చేయిస్తోందంటున్న విజయ్ దేవరకొండ!