నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వేముల వీరేశం భారీ ర్యాలీతో నిర్వహించారు. నకిరేకల్ చౌరస్తాలో జరిగిన సభలో వేముల వీరేశం, మధు యాష్కీ గౌడ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు.. కానీ, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తరువాత కేటీఆర్ మాత్రమే సీఎం అవుతారు అని ఆయన విమర్శించారు. మన లక్ష్యం సీఎం పదవి కావొద్దు.. ఎప్పుడో ఒకసారి నేనూ కూడా సీఎం అవుతా.. పదవుల మీద నాకు ఆశ లేదు.. ఆశ ఉంటే ఆనాడు మంత్రి పదవి వదిలి పెట్టే వాడిది కాదు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మన లక్ష్యం అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఒకొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా.. తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ అభ్యర్థులే.. బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ లతో కేసీఆర్ కు జ్వరం వచ్చింది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Leo movie: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంటున్న నాగవంశీ!
కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేశాల మేరకు పని చేస్తా అని వేముల వీరేశం అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి రావడానికి పనిచేస్తా.. సీనియర్ కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి వేముల వీరేశంను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను అని మధు యాష్కీ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ 25 సీఎట్లకే పరిమితం అవుతుందని నాకు సమాచారం ఉంది.. తెలంగాణ వచ్చిన తరువాత అమరులను, వీరులను, నేతలను కేసీఆర్ మరిచిపోయారు.. కేసీఆర్ పాలనలో తెలంగాణ సంపద దోపిడీకి గురవుతుంది అని మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు.