తాజాగా కాంగ్రెస్ పార్టీలో వేముల వీరేషం జాయిన్ అయిన తర్వాత ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నకిరేకల్ నేతల ముందు ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యపై హాట్ కామెంట్స్ చేశారు. మేము దగ్గరుండి గెలిపిస్తే.. మమ్మల్ని దారుణంగా మాట్లాడుతుండు.. మేము ఫస్ట్ జడ్పీటీసీగా గెలిపిస్తే.. పెద్ద పదవి ఎందుకు అన్నాడు.. తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించాం.. ఒకటి కాదు రెండు సార్లు గెలిపించిన.. ఇప్పుడు ఇష్టమున్నట్లు మాట్లాడుతుండు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: MS Dhoni Hairstyle: ఎంఎస్ ధోనీ నయా హెయిర్ స్టైల్.. పోలా అదిరిపోలా..!
నకిరేకల్ లో.. రేపటి నుంచి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయండి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వేముల వీరేషంను గెలిపిద్దాం.. కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయండి.. వీరేశంకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తా.. నాకు.. నల్లగొండ, నకిరేకల్ రెండు కళ్ళ లాంటివి.. ఇన్నాళ్లు నకిరేకల్ లో పార్టీని బతికించిన వారిని నేను చూసుకుంటా.. ఎవరూ అధైర్యపడొద్దు అని వెంకట్ రెడ్డ తెలిపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
Read Also: Real Estate Business: డబ్బుల పంట పడించిన వినాయకచవితి.. మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1124 కోట్ల ఆదాయం
దీంతో కార్యకర్తలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారించారు. నకిరేకల్ లో వీరేశంను గెలిపిస్తే.. సీఎం అయినంత సంతోషిస్తా.. కాంగ్రెస్ లో ఎవరు సీఎం అయినా.. ప్రజలకు అందుబాటులో ఉంటారు.. కార్యకర్తలు.. సీఎం బెడ్ రూమ్ లోకి వెళ్లే అంత స్వేచ్ఛ ఉంటది అని ఆయన పేర్కొన్నారు. ఈసారి సూర్యాపేటలో జగదీష్ రెడ్డీకీ డిపాజిట్ కూడా రాదు.. రెండు సార్లు సూర్యాపేటలో గెలించిండు అని అన్నాడు. ఇక, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 12 సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది.. మోత్కుపల్లి నర్సింహులు జాయినింగ్ గురించి నాకు తెలియదని ఆయన చెప్పారు.
Read Also: Naga Bhushana: ఫుట్ పాత్ పై వెళ్తున్న వారికి యాక్సిడెంట్ చేసిన నటుడు… ఒకరు భార్య మృతి
స్కూటర్, కారు లేని జగదీష్ రెడ్డి వేళ కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు అని ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నించారు. సూర్యాపేటలో అతని కుటుంబ సభ్యుల భూముల్లో కలెక్టరేట్ పోలీసు హెడ్ క్వాటర్స్ ఎలా కట్టించారు అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగదీష్ రెడ్డికీ తగిన గుణపాఠం చెప్పేందుకు సూర్యాపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.