ఖమ్మం వెళ్తూన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నల్గొండ జిల్లా నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని డబ్బు సంచుల్ని దాచుకుంటుంది అని ఆయన ఆరోపించారు. రేపు రాబోయే ఎన్నికల్లో డబ్బు సంచులతో మీ ముందుకు రాబోతుంది అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పంచిన డబ్బు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read Also: Bihar Politics: ఒవైసీ భయం బీహార్ సీఎంను కలవరపెడుతోందా?
నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీనీ గెలిపించుకోవాలి అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలోని 12 కు 12 కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కా అమలు చేస్తాము.. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆయన తెలిపారు. మా గ్యారెంటీ లపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారు.. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ కాదు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీలకు అధికారం ఇస్తే.. దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు అని ఆయన ఆరోపించారు.