భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తిప్పర్తి మండలం ఎంపీపీ విజయ లక్ష్మీ, జడ్పీటీసీ పాశం రాంరెడ్డితో పాటు 12 మంది సర్పంచ్ లు చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నాకు మద్దతు ఇవ్వండి.. 20 ఏండ్లు నల్గొండను ప్రశాంతంగా అభివృద్ధి చేసుకుందాం అని పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చే వారికి మాటిస్తున్నాను.. వచ్చే ఐదేళ్లు మీ సేవలో ఉంటా.. ఐదోసారి ఓడిపోయినా.. భువనగిరి ఎంపీగా గెలిపించారు అంటూ కోమటిరెడ్డి తెలిపారు.
Read Also: Gutha Sukender Reddy: రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు..
నేను నల్గొండ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మీరే నాయకులుగా ఉండి గెలిపించండి.. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.. రెండుసార్లు కేసీఆర్ కి అవకాశం ఇచ్చారు.. ఈసారి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ఆయన కోరారు. వేనేపల్లి చందర్ రావు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ లో చేరారు.. స్థానిక ఎమ్మెల్యే గెలిచిన రెండు నెలలకే వేనేపల్లిని అనరాని మాటలు అన్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు కష్టపడితేనే మేము ఎమ్మెల్యేలము అవుతాము.. గతంలో మిగిలిన పనులు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.
Read Also: Manda Krishna Madiga: పొంగులేటి ఖమ్మం రాలేదు… తుమ్మల పాలేరు కు పోలేదు..
రేపటి నుండి గ్రామ గ్రామాన తిరుగుతాను అని ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వండి..అండగా ఉంటాను.. ముప్పై రోజులు మీరు కష్టపడండి.. ఐదేళ్లు మీకోసం నేను కష్టపడతా అని ఆయన అన్నారు. నేను నల్గొండలో తిరిగితే.. మిమ్మల్ని ఎమ్మెల్యే వేదిస్తాడని ఎక్కువగా నేను రాలేక పోయాను.. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరినైనా వేదించామా?.. అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.