Saif Ali Khan Case: ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల ముంబైలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై పోలీసులు ( Mumbai Police) నిందితుడిని క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం అతన్ని సైఫ్ అలీఖాన్ నివాసానికి, ఆపై బాంద్రా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు, నిందితుడి సహాయంతో సైఫ్ అలీఖాన్ నివాసంలో జరిగిన క్రైమ్‌సీన్ రీక్రియేషన్ (Crime Scene Reenactment) చేసారు. దాడి సమయంలో నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఏ కెమెరాలో…
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగి దాదాపుగా ఒకటిన్నర రోజు కావస్తోంది. అయితే, ఇప్పటికీ 5 ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించడం లేదు. ఆయనపై దాడి ఘటన మొత్తం చిత్రపరిశ్రమనే షాక్‌కి గురిచేసింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసి 6 చోట్ల గాయపరిచాడు. ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. 23 ఏళ్ల టీవీ నటుడు అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచాడు. ధర్తీపుత్ర నందిని అనే సీరియల్లో అమన్ జైస్వాల్‌కు మంచి పేరు వచ్చింది.
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి యావత్ దేశాన్ని షాక్‌కి గురి చేసింది. అయితే, సకాలంలో ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ ఇప్పుడు హీరోగా మారారు. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా హుటాహుటీన సైఫ్‌ని ఆస్పత్రికి తరలించడంలో సాయం చేశాడు. ఈ సంఘటన గురించి ఆయన వెల్లడించారు.
Saif Ali Khan: గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లో దాడికి గురయ్యాడు. ఇంట్లోకి అక్రమంగా చొరబడిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన ఆరు కత్తిపోట్లకు గురయ్యారు. మెడ, వెన్నుముకపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఆయనని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించారు.
Daya Nayak: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై ఈ రోజు తెల్లవారుజామున దుండగుడు దాడి చేసిన ఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. సైఫ్ ఒంటిపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. అయితే, ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Read Also:…
ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దొంగతనానికి వచ్చిన అగంతకుడు.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేయగా.. ఆరు కత్తిపోట్లు పడ్డాయి.
PM Modi: భారతదేశంలో అధునాతన యుద్ధనౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్‌షీర్‌లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఈరోజు నౌకలను నరేంద్ర మోడీ ప్రారంభించారు.
PM Modi: అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్‌షీర్‌లను ఈరోజు (జనవరి 15) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు కూటమిల్లోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మహా వికాస్ అఘాడీ కూటమి డీలా పడింది. శివసేన (యూబీటీ) ఒంటరిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.