Kunal Kamra: కమెడియన్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రాహుల్‌గాంధీ, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్
- కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యల ఎఫెక్ట్
- కునాల్, రాహుల్‌గాంధీ, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. థానే నుంచి వచ్చిన ఓ నాయకుడు.. బీజేపీతో చేతులు కలిపి శివసేనను చీల్చేశాడంటూ.. అతడు దేశద్రోహి అంటూ షిండేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని ఖార్ ప్రాంతంలోని ‘ది హాబిటాట్ కామెడీ’ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో కునాల్ కమ్రా ‘దిల్ తో పాగల్ హై’ పాటను రాజకీయ పేరడీ చేసి పాడారు. ఇందులో షిండేను ఉద్దేశించి ద్వంద్వ అర్థం వచ్చేలా పాడారు. ఈ సందర్భంగా షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ అభివర్ణించాడు. ఇదే షిండే అభిమానులకు కోపం తెప్పించింది. కునాల్‌కు వ్యతిరేకంగా క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: CSK vs MI: నా మైండ్ బ్లాక్ అయింది.. ఎంఎస్ ధోనీ సూపర్: రుతురాజ్ గైక్వాడ్
Also Read
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ఇక కునాల్ కమ్రా వ్యాఖ్యలు దుమారం చెలరేగడంతో శివసేన యువసేన ప్రధాన కార్యదర్శి రాహుల్ కనాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కునాల్ కమ్రా సహా రాహుల్‌గాంధీ, ఆదిత్య ఠాక్రేపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ముగ్గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కునాల్.. పేమెంట్ కమెడియన్‌గా పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతోనే షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందంటూ శివసేన నేత ఆరోపించారు.
ఇది కూడా చదవండి: YS Jagan: నేడు పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన!
కునాల్ ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యానించాడని.. ఉద్దశ పూర్వకంగానే షిండేను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కామ్రా వ్యాఖ్యలు భారతీయ న్యాయ సంహిత (BNS) 2023 నిబంధనల ప్రకారం అభ్యంతరకరమైనవి, చట్టవిరుద్ధమైనవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా షిండే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు అని ఫిర్యాదులో తెలిపాడు. ప్రజాప్రతినిధులపై నిర్మాణాత్మక విమర్శలు ఎప్పుడు స్వాగతిస్తామని.. అంతేకాని కించపరిచే, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు. క్రిమినల్ నేరాలుగా పరిగణించాలని కోరారు. తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కనల్ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే క్లబ్‌పై దాడి చేసిన శివసేన కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. క్లబ్ లోపల కుర్చీలు విసిరి, వస్తువులు పగలగట్టారు. అంతేకాకుండా కమెడియన్‌ను ఒక ఎంపీ బెదిరింపులకు పాల్పడ్డారు. దేశంలో ఎక్కడా తిరగనివ్వమన్నారు.
ఇక శివసేన కార్యకర్తల దౌర్జన్యంపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధ్వజమెత్తారు. ఇక శివసేన కార్యకర్తలు చేసిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాష్ట్రంలో ఒక బలహీనమైన హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారని ఆరోపించారు. మహారాష్ట్ర రాజకీయాలపై కునాల్ వ్యంగ్య పాట రాశారని.. దానికి షిండే అభిమానులు క్లబ్‌ను ధ్వంసం చేయడం దారుణం అన్నారు.
ఇది కూడా చదవండి: Bhargavi : యూట్యూబ్ ఛానల్స్ థంబ్‌నెయిల్‌పై మండిపడిన నటి భార్గవి
#WATCH मुंबई: महाराष्ट्र के उपमुख्यमंत्री एकनाथ शिंदे पर कॉमेडियन कुणाल कामरा की टिप्पणी के बाद शिवसेना (एकनाथ शिंदे गुट) के कार्यकर्ताओं ने खार में हैबिटेट कॉमेडी क्लब में तोड़फोड़ की। (23.03)
सोर्स: शिव सेना (एकनाथ शिंदे गुट) pic.twitter.com/sLr6E7FtYq
— ANI_HindiNews (@AHindinews) March 24, 2025
कुनाल कामरा एक जानेमाने लेखक और स्टँडप कॉमेडियन है
कुणालने महाराष्ट्रकी राजनीती पर एक व्यंगात्मक गाना लिखा तो शिंदे गैंग को मिरची लगी.
उनके लोगोने कामराका स्टूडियो तोड दिया.
देवेंद्रजी , आप कमजोर गृहमंत्री हो!
@narendramodi
@Dev_Fadnavishttps://t.co/7ciSQRQY81— Sanjay Raut (@rautsanjay61) March 23, 2025
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!