మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు… ముంబైలోని స్టూడియో, క్లబ్‌పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే కునాల్‌పై శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కునాల్ కమ్రాతో సహా దాడికి పాల్పడ్డ శివసేన కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Bollywood : ఖాన్స్‌ను టార్గెట్ చేస్తోన్న తమిళ స్టార్ డైరెక్టర్
తాజాగా ఈ వివాదంపై కునాల్ కమ్రా స్పందించారు. తన వ్యాఖ్యలకు ఏ మాత్రం చింతించడం లేదని ముంబై పోలీసులకు కునాల్ కమ్రా తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ముంబై పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కునాల్ కమ్రా తమిళనాడులో ఉన్నారు. మహారాష్ట్రలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ముంబై పోలీసులు.. కునాల్ కమ్రాను స్పందించారు. ఈ మేరకు తన వ్యాఖ్యలకు చింతించడం లేదని చెప్పినట్లుగా ముంబై పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. తనకు ప్రతిపక్షాలు డబ్బులిచ్చి మాట్లాడి ఇస్తున్నారంటూ చేస్తున్న వదంతులను కూడా కునాల్ తోసిపుచ్చారని పోలీస్ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను బయటపట్టాలని కునాల్ డిమాండ్ చేసినట్లుగా చెప్పారు. ఒకవేళ న్యాయస్థానాలు అడిగితే మాత్రం క్షమాపణ చెబుతానని కునాల్ ప్రకటించినట్లుగా ముంబై పోలీస్ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: kiccha Sudeep : దూకుడు పెంచుతోన్న కిచ్చా.. హిట్ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్
ఇక కునాల్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. కానీ ఇప్పటి వరకు ఏక్‌నాథ్ షిండే మాత్రం స్పందించలేదు. షిండేకు ముఖ్యమంత్రి ఫడ్నవిస్ పూర్తి మద్దతు ప్రకటించారు. తన మిత్రుడిపై చేసిన వ్యాఖ్యలకు కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను హాస్యానికి వ్యతిరేకం కాదన్నారు. కానీ ఒక వ్యక్తిని అగౌరవపరచడం సరికాదన్నారు. 2024 ఎన్నికల్లో దేశద్రోహి ఎవరో మహారాష్ట్ర ప్రజలు నిరూపించారన్నారు. బాల్ థాకరే వారసత్వం ఎవరికి ఉందో ప్రజలు నిర్ణయించారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం స్వేచ్ఛను ఇచ్చింది.. ఇతరుల స్వేచ్ఛను భంగపరచడానికి కాదన్నారు. రాజ్యాంగాన్ని ఎత్తు చూసి తప్పును సమర్థించుకోవడం భావ్యం కాదని ఫడ్నవిస్ హితవు పలికారు.
నెల రోజుల క్రితం ఒక షోలో కమెడియన్ కునాల్ కమ్రా.. షిండేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 1997 బ్లాక్‌బస్టర్ దిల్ తో పాగల్ హై చిత్రంలోని ‘‘భోలి సి సూరత్’ పాటను పేరడీ చేసి కునాల్ కమ్రా పాడారు. ఏక్‌నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకుని పేరడీ చేశారు. 2022లో ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు నాయకత్వం వహించి, ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేసి, పార్టీని విభజించిన శివసేన నాయకుడు దేశద్రోహి అంటూ కునాల్ వ్యాఖ్యానించాడు.
తాజాగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శివసేన కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. దీంతో ఆదివారం ముంబైలోని హాబిటాట్ స్టూడియోపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అంతేకాకుండా ఒక క్లాబ్‌పై కూడా దాడి చేశారు. కుర్చీలు, కెమెరాలు, లైట్లు, స్పీకర్లను ధ్వంసం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక శివసేన కార్యకర్తల దౌర్జన్యంపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధ్వజమెత్తారు. ఇక శివసేన కార్యకర్తల దౌర్జన్యంపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధ్వజమెత్తారు. ఇక శివసేన కార్యకర్తలు చేసిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాష్ట్రంలో ఒక బలహీనమైన హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారని ఆరోపించారు. మహారాష్ట్ర రాజకీయాలపై కునాల్ వ్యంగ్య పాట రాశారని.. దానికి షిండే అభిమానులు స్టూడియోను ధ్వంసం చేయడం దారుణం అన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని.. అందుకే ఏక్‌నాథ్ షిండేను టార్గెట్ చేస్తున్నారని లోక్‌సభ ఎంపీ నరేష్ మ్హాస్కే ఆరోపించారు. కునాల్ ఒక కాంట్రాక్ట్ కమెడియన్ అంటూ మండిపడ్డారు. డబ్బుల కోసం తమ నాయకుడిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని నరేష్ మ్హాస్కే ధ్వజమెత్తారు. మహారాష్ట్రలోనే కాదు.. కునాల్ దేశంలో ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేడని హెచ్చరించారు. శివసేన సైనికులు అతన్ని వెంటాడుతూనే ఉంటారని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై సీఎం సమీక్ష.. అలర్ట్ గా ఉండండి..!