Ajit Pawar: కునాల్ కమ్రా వ్యాఖ్యలపై స్పందించిన అజిత్ పవార్
- కునాల్ కమ్రా వ్యాఖ్యలపై స్పందించిన అజిత్ పవార్
- చట్టం పరిధి దాటి వ్యవహారించకూడదని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఇప్పటికే శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. ఇక శివసేన కార్యకర్తలు.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Lok sabha: లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు స్టాల్ ప్రారంభం
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ఇక ఈ అంశంపై ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ఎవరూ కూడా చట్టం పరిధి దాటి వ్యవహారించకూడదని సూచించారు. రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు కట్టుబడి మాట్లాడాలని హితవు పలికారు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అంతమాత్రాన హద్దులు దాటి మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఎవరైనా పరిమితుల్లోనే మాట్లాడాలన్నారు. అనుచిత వ్యాఖ్యలు కారణంగా పోలీస్ శాఖ జోక్యం చేసుకోవల్సి వచ్చిందన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గానీ.. డిప్యూటీ సీఎం షిండేగానీ స్పందించలేదు.
ఇది కూడా చదవండి: ASHA Workers Protest: హైదరాబాద్ లో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం
నెల రోజుల క్రితం ఒక షోలో కమెడియన్ కునాల్ కమ్రా.. షిండేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 1997 బ్లాక్‌బస్టర్ దిల్ తో పాగల్ హై చిత్రంలోని ‘‘భోలి సి సూరత్’ పాటను పేరడీ చేసి కునాల్ కమ్రా పాడారు. ఏక్‌నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకుని పేరడీ చేశారు. 2022లో ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు నాయకత్వం వహించి, ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేసి, పార్టీని విభజించిన శివసేన నాయకుడు దేశద్రోహి అంటూ కునాల్ వ్యాఖ్యానించాడు.
తాజాగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శివసేన కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. దీంతో ఆదివారం ముంబైలోని హాబిటాట్ స్టూడియోపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అంతేకాకుండా ఒక క్లాబ్‌పై కూడా దాడి చేశారు. కుర్చీలు, కెమెరాలు, లైట్లు, స్పీకర్లను ధ్వంసం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో ది హాబిటాట్ స్టూడియోను మూసివేయాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. స్టాండ్-అప్ కామెడీ షోలకు ఈ స్టూడియో పేరు సంపాదించింది. ప్రస్తుతానికి మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ది హాబిటాట్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Elon Musk: మస్క్ సరికొత్త విన్యాసం.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!