మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఇక కునాల్ కమ్రా ఉపయోగించిన క్లబ్, స్టూడియోను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం శివసేన శ్రేణులు.. కునాల్ కమ్రాపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక పోలీసులు.. కునాల్ కమ్రా, శివసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.
తాజాగా కునాల్ కమ్రాను శివసేన మద్దతుదారుడు బెదిరించిన ఫోన్‌కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కాల్ చేసిన వ్యక్తి.. కునాల్ కమ్రాను దుర్భాషలాడాడు. ముంబైలోని స్టూడియోకి ఎదురైన గతే ఎదురవుతుందని హెచ్చరించారు. 53 సెకన్ల ఆడియో క్లిప్‌లో బెదిరింపులు కనిపించాయి. ఫోన్ చేసిన వ్యక్తి మొదట.. తాను జగదీష్ శర్మగా పరిచయం చేసుకున్నాడు.. అనంతరం అటువైపు నుంచి కునాల్ కమ్రానేనా? అని నిర్ధారించుకున్నాడు. అనంతరం సంభాషణ ప్రారంభించి బెదిరింపులకు దిగాడు. తాను ప్రస్తుతం తమిళనాడులో ఉన్నానని.. ఇక్కడికి రావాలని కునాల్ తెలిపాడు. దానికి శర్మ బదులిస్తూ.. దక్షిణాది రాష్ట్రానికే వచ్చి కొడతానంటూ బెదిరించాడు. అనంతరం మరొక శివసేన మద్దతుదారుడు కాల్‌ను స్వీకరించి.. కునాల్‌ను ఎక్కడున్నారని అడిగాడు. ఎక్కడికి రావాలని అడుగుతాడు. ప్రస్తుతం తాను తమిళనాడులో ఉన్నట్లు కునాల్ బదులిచ్చాడు. ఇప్పుడు తమిళనాడుకు ఎలా చేరుకోవాలి? అని అడుగుతాడు. అనంతరం మా సార్‌తో ఒక్క నిమిషం మాట్లాడండి అనగానే కాల్ డిస్‌కనెక్ట్ అయింది.
సంభాషణ వివరాలు ఈ విధంగా…
కునాల్ కమ్రా: హలో
కాలర్: మాట్లాడేది కునాల్ కమ్రానేనా?
కునాల్ కమ్రా: అవును అవును. చెప్పు.
కాలర్: జగదీష్ శర్మ మాట్లాడుతున్నారు. మీ వీడియోలో సాహెబ్ గురించి మీరు ఏమి చెప్పారు?
కునాల్ కమ్రా: ఇది ఏ సాహెబ్?
కాలర్: షిండే సాహెబ్, మన (ఉప) ముఖ్యమంత్రి. మీ వీడియోలో ఆయన గురించి మీరు ఏమి మాట్లాడారు?
కునాల్ కామ్రా: ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఆయన ఉప ముఖ్యమంత్రి
కాలర్: ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయన గురించి మీరు ఏ వీడియో పెట్టారు?
కునాల్ కమ్రా: మీరు వీడియో చూశారా?
కాలర్: చూశాను. వెళ్లి హోటల్ లేదా స్టూడియోకి వెళ్లి చూడండి. అక్కడ ఏం జరిగిందో మీకు అదే గతి పడుతుంది. అర్థమైందా?
కునాల్ కామ్రా: తమిళనాడుకు రండి. మీరు నన్ను ఇక్కడ కనుగోండి.
కాలర్: మీరు ఎక్కడ ఉంటారు?
కునాల్ కమ్రా: తమిళనాడు
కాలర్: తమిళనాడుకు వచ్చి నిన్ను కొడతాను
కాలర్ (మరొక వ్యక్తి ఫోన్ తీసుకుంటున్నాడు): హలో
కునాల్ కమ్రా: రండి, తమిళనాడుకు రండి.
కాలర్: ఎక్కడికి రావాలి?
కునాల్ కమ్రా: తమిళనాడు
కాలర్: ఇప్పుడు తమిళనాడు ఎలా చేరుకోవాలి? తమిళనాడు ఎలా చేరుకోవాలి? మా సార్ తో ఒక్క నిమిషం మాట్లాడండి. అనంతరం ఫోన్ డిస్‌కనెక్ట్ అయింది.
ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలకు ఏ మాత్రం చింతించడం లేదని కునాల్ కమ్రా తెలిపారు. ఒకవేళ న్యాయస్థానాలు క్షమాపణలు అడిగితే మాత్రం చెబుతానన్నారు. షిండేను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రతిపక్షాలు ఎంత డబ్బులిచ్చాయన్న ఆరోపణలను కునాల్ కొట్టిపారేశారు. ఈ మేరకు ముంబై పోలీసులకు కునాల్ కమ్రా సమాధానం ఇచ్చారు.
ఇక తన నెంబర్ లీక్ చేస్తున్న వారికి ఒక ప్రకటన విడుదల చేశారు. నిరంతరం తనకు కాల్ చేస్తున్న వారికి.. అన్ని కాల్స్ వాయిస్ మెయిల్‌కి వెళ్తాయన్నారు. అక్కడ ద్వేషించే పాటను వింటారన్నారు. ఆ విధంగానైనా పాట యొక్క భావాన్ని గ్రహిస్తారని అనుకుంటున్నట్లు కునాల్ ప్రకటనలో తెలిపారు.
शिंदे सैनिक: तूने CM साहब के बारे में क्या बोला?
कुणाल: वो CM नहीं डिप्टी CM हैंशिंदे सैनिक: किधर रहता है तू?
कुणाल: तमिलनाडुशिंदे सैनिक: किधर आने का?
कुणाल: तमिलनाडुशिवसैनिक: अभी तमिलनाडु कैसे पहुंचेगा भाई?
ग़ज़ब कॉमेडी चल रही है भाई 🤣😂🤣 pic.twitter.com/EccQkrIZ4a
— Supriya Shrinate (@SupriyaShrinate) March 24, 2025
My Statement – pic.twitter.com/QZ6NchIcsM
— Kunal Kamra (@kunalkamra88) March 24, 2025