తన మిస్ వరల్డ్ ప్రయాణం ప్రారంభానికి ఇండియానే వేదిక అని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా పేర్కొంది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడింది. నమస్తే ఇండియా.. హెల్లో వరల్డ్.. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించింది. తాను గత మిస్ వరల్డ్ పోటీల్లో ముంబాయిలోనే విజేతగా నిలిచినట్లు తెలిపింది. ఇండియా తనకు ఎప్పుడు స్పెషల్ అని చెప్పింది. ఇక్కడ ప్రజల చాలా మంచి అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుందని స్పష్టం చేసింది. తెలంగాణ చాలా బాగుందని.. ఇక్కడి ప్రజల చాలా బాగున్నారంది.. హైదరాబాద్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి వేదికగా మారబోతోందని తెలిపింది. ఇక్కడ కల్చర్, ట్రెడిషన్స్ చాలా బాగున్నాయని కొనియాడింది.
READ MORE: Meerut Murder: ‘‘నాన్న డ్రమ్‌లో ఉన్నాడు’’.. తండ్రి హత్య గురించి పక్కింటి వాళ్లకు చెప్పిన పాప..
అనంతరం.. టూరిజం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ స్మిత సబర్వాల్ మాట్లాడారు. “మిస్ వరల్డ్ అందాల పోటీలకు రాబోతున్న వారికి అందరికీ స్వాగతం.. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా, మిస్ వరల్డ్ సీఈఓ కి సాదర స్వాగతం.. తెలంగాణ చాలా ఆనందంగా ఉంది.. ఇంత పెద్ద ఈవెంట్ కి వేదిక అయ్యింది.. తెలంగాణ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.. తెలంగాణ అనేక సంస్కృతులకు, సంప్రదాయాలకు ప్రతీక.. ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు.. ఎంతోమంది మేధావులు, కవులు పుతున్న ఇల్లు తెలంగాణ.. తెలంగాణ వంటకాలు, హైద్రాబాద్ బిర్యాని, ఇరానీ చాయ్ ఇక్కడ స్పెషల్స్.. ఎంతోమంది క్రీడాకారులను అందించిన తెలంగాణ.” అని స్మిత సబర్వాల్ వ్యాఖ్యానించారు.