Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‘‘లవ్ జిహాద్’’ చట్టం అవసరాన్ని చెప్పారు. దాదాపు లక్ష కేసులు ఈ విధంగా నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసులను మొదట్లో మతాంతర వివాహాలుగా చూసినప్పటికీ, పురుషులు వివాహానికి ముందు తమ గుర్తింపుని దాచిపెట్టి, పిల్లలు పుట్టిన తర్వాత తమ భార్యలను విడిచిపెడుతున్నారని పేర్కొన్నారు. ఈ స్త్రీలలో చాలా మందిని వారి కుటుంబాలు తిరస్కరిస్తున్నాయని, వారి జీవితాలు విధుల పాలవుతున్నాయని చెప్పారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కి చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా. ఈ కంపెనీ భారత్లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది టెస్లా రాక కోసం ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణ అతి త్వరలో ముగియబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన మొదటి షోరూమ్ కోసం స్థలాన్ని చూసింది. షోరూమ్ కోసం కంపెనీ దాదాపు 4,000 చదరపు అడుగుల స్థలాన్ని…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ముఖ్యమంత్రిపై దాడి చేయబోతున్నట్లు సందేశం యొక్క సారాంశం. ఈ బెదిరింపుపై ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Mumbai: మహారాష్ట్రలోని అలిబాగ్ సముద్ర తీరానికి సమీపంలో ఓ మత్స్యకారుల బోటుకు అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. ఈ బోటులో 18 నుండి 20 మంది మత్స్యకారులు ఉన్నారని సమాచారం. అయితే, అందులోని మత్స్యకారులందరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. నేడు ఉదయం అలిబాగ్ సమీప సముద్రంలో ఓ మత్స్యకారుల బోటుకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.…
ఏపీ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ముంబైలో పర్యటిస్తున్నారు.. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA), సిడ్కో అధికారులతో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో MMRDA ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు..
న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ప్రధాన నిందితుడు హితేష్ మెహతాను అరెస్టు చేసింది. మొదట హితేష్ మెహతాకు సమన్లు పంపింది. హితేష్ నివాస స్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ జరిపారు. అనంతరం హితేష్ అరెస్టు చేశారు.
రంజీ ట్రోఫీలో ముంబై జట్టు రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 6న ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం రోహిత్ భారత జట్టుతో చేరాడు. దీంతో గురువారం మేఘాలయాతో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-ఎ మ్యాచ్లో ముంబై హిట్మ్యాన్ లేకుండానే ఆడనుంది. మరోవైపు ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపికైన యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ కూడా ముంబై తరఫున బరిలో దిగడం లేదు. వీరి స్థానాల్లో ఆంగ్క్రిష్ రఘువంశి, సూర్యాంష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్లను…
ముంబైలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యా్న్ని కంట్రోల్ చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాహనాలు రద్దు చేయాలని ఫడ్నవిస్ ప్రభుత్వం భావిస్తోంది.
ముంబైలో మహిళపై అత్యాచార ఘటనలో ఇప్పటికే ఆటోడ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో తాజాగా ఒక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో విస్తుగొల్పే విషయాలు బయటకు వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసాయ్ బీచ్లో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత సదరు మహిళ అక్కడి నుంచి తప్పించుకుని రైల్వే స్టేషన్కు చేరుకుని.. ఆటో డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారులను చెప్పింది. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. సర్జికల్ బ్లేడ్, రాళ్లతో సహా విదేశీ వస్తువులను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు తేలింది.