కొడాలి నానిని ముంబై తరలించే అవకాశం ఉంది.. హార్ట్ స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం ముంబై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది.. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్‌కి తరలించే అవకాశం ఉంది. కొడాలి కి హార్ట్ లో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం.. హార్ట్ స్పెషల్ హాస్పిటల్ అయిన ముంబై బాంద్రా లోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సర్జరీ చేయించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
READ MORE: Mamata Banerjee: బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతుంది.. ప్రజలు రెచ్చగొట్టే చర్యలను ప్రతిఘటించాలి!
కాగా.. వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు డిశ్చార్జీ అయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరగా, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారణ అయ్యింది. దీంతో స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరమవచ్చని డాక్టర్లు సూచించారు. కొంతకాలం చికిత్స తీసుకున్న తర్వాత సర్జరీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు సర్జరీ చేయించాలని నిర్ణయించారు.
READ MORE: RR vs CSK: నేను తెలుగు సినిమాలు చూస్తా.. ‘పుష్ప’ సూపర్: శ్రీలంక బౌలర్