దేశంలో పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం భారీగా వేడిగాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి గాలులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్సుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Donald Trump: సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్.. చైనాకు మాత్రం భారీ షాక్..
రాజస్థాన్, గుజరాత్‌లో పగట ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటున్నాయి. 44 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఇక రాజస్థాన్‌లోని బార్మర్ నగరాల్లో 46 డిగ్రీలు, మహారాష్ట్రలోని జల్గావ్‌లో 42 డిగ్రీలు, ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ముంబైలో బుధవారం అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న ఒక రహదారి వేడి కారణంగా కరిగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ముంబైకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Nizamabad: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృ వియోగం
అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇక పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఏప్రిల్, మే, జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉండొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో అధిక ప్రభావం ఉండొచ్చని తెలిపింది.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మాత్రం సాధారణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్, నిజామాబాద్ వంటి నగరాల్లో తీవ్రమైన వేడి ఉంటుందని.. కానీ అప్పుడప్పుడు కురిసే వర్షాలు కారణంగా కొన్ని ప్రాంతాలు చల్లబడుతున్నాయని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 13 వరకు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చల్లని వాతావరణం ఉంటుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Tahawwur Rana: భారత్‌కు నేడు ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహావుర్ రాణా