బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పురబ్ ఔర్ పశ్చిమ్, క్రాంతి వంటి దేశభక్తి చిత్రాల్లోని పాత్రలకు మనోజ్ కుమార్‌కు మంచి పేరు వచ్చింది. మనోజ్ కుమార్ మరణవార్తతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
మనోజ్ కుమార్ 1937లో బ్రిటిష్ ఇండియాలోని నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ (పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా)లోని అబోటాబాద్ అనే పట్టణంలో జన్మించారు. అసలు పేరు హరికృష్ణన్ గోస్వామి. 1957లో ‘ఫ్యాషన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంచ్ కీ గుడియా (1961)లో సయీదా ఖాన్‌తో కలిసి నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపునకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డుతో సత్కరించింది.
మనోజ్‌కుమార్ దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమకు సేవలు అందించారు. బాలీవుడ్‌లో అగ్ర హీరోలందరితో సినిమాలు తీశారు. ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. 1982లో పద్మశ్రీ, 2016లో దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డులు అందుకున్నారు.