స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు షాక్ తగిలింది. బుక్ మై షోలో కళాకారుల జాబితా నుంచి కునాల్ కమ్రా పేరును తొలగించింది. ఆర్టిస్టుల జాబితా నుంచి కునాల్ పేరును తొలగించిందని శివసేన కార్యకర్త రాహుల్ కునాల్ శనివారం తెలిపారు. ఇప్పుడు పోర్టల్ పరిశుభ్రంగా ఉందని.. అటువంటి కళాకారుడిని వినోద జాబితా నుంచి దూరంగా ఉంచినందుకు బుక్‌మైషో సీఈవో ఆశిష్ హేమరాజనికి రాహుల్ కునాల్ కృతజ్ఞతలు తెలిపారు. బుక్‌మైషో బృందాన్ని సంప్రదించినప్పుడు ప్రస్తుతానికి కునాల్‌కు సంబంధించిన వీడియోలు లేవని చెప్పారని తెలిపారు. అంతేకాకుండా పోర్టల్‌లో ఎలాంటి ప్రమోషన్స్ ఇవ్వమని కూడా చెప్పినట్లుగా పేర్కొన్నారు. శాంతిని కాపాడటంలో.. అలాగే భావోద్వేగాలను గౌరవించడంలో బుక్ మై షో పోర్టల్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ముంబై ప్రజలు.. కళను ప్రేమిస్తారు కానీ.. వ్యక్తిగత అజెండాలను కాదని రాహుల్ కునాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి కమెడియన్ కునాల్ కమ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే శివసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అనంతరం కునాల్ కమ్రా కార్యక్రమం నిర్వహించిన క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. అంతేకాకుండా పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Dokka Manikya Varaprasad: దళితులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి చులకన..
కునాల్ కమ్రాకు ముంబై పోలీసులు రెండు సార్లు సమన్లు పంపించారు. కానీ కునాల్ కమ్రా మాత్రం హాజరుకాలేదు. అంతేకాకుండా షిండేపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదన్నారు. న్యాయస్థానాలు అడిగితే మాత్రం క్షమాపణ చెబుతానని చెప్పారు. ఇంతలో మద్రాస్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం కునాల్ కమ్రా పుదుచ్చేరిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కునాల్ కమ్రాకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా మద్దతు ఇచ్చారు. కునాల్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Karnataka: భర్తలారా..బహుపరాక్! ఇల్లాలు హత్య కేసులో జైలుకు భర్త.. తీరా చూస్తే..!