ఈరోజు ముంబై, కోల్‌కతా జట్ల మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డీకాక్‌లు రాణించడంతో భారీ స్కోర్ సాధిస్తుందని అనుకున్నారు. అయితే, ఓపెనర్లు ఔటయ్యాక మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులు మాత్రమే చేసి కోల్‌కతా ముందు 156 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్ కు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతున్నది. కొద్దిసేపటి క్రితమే టాస్ వేయగా, కోల్‌కతా జట్టు టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్నది. ఇప్పటికే ముంబై జట్టు తన మొదటి మ్యాచ్‌లో చైన్నైపై ఓటమి పాలైంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నది. అయితే, కోల్‌కతా జట్టు బెంగళూరుపై అద్భతమైన విజయాన్ని సొంతం చేసుకొని అదే దూకుడును ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించాలని…
నటుడు, లాక్ డౌన్ రియల్ హీరో సోనూసూద్ పై రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న అర్థరాత్రి వరకూ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై దాడులు చేసిన ఆదాయపు పన్ను అధికారులు.. ఈ ఉదయం ముంబైలోని అతని ఇంటికి వెళ్లారు. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీతో సోనూ సూద్ ఆస్తి ఒప్పందంపై దర్యాప్తు చేస్తున్నారు. పన్ను ఎగవేసినట్లు అనుమానాలున్నాయని, అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. నిన్న సోనూ సూద్ తో…
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. నిన్నటి రోజున 43 వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 43 వేల కేసుల్లో 30 వేలకు పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. 180 మంది కరోనాతో మృతి చెందారు. ఇక ఇదిలా ఉంటే, మహారాష్ట్ర రాజధాని ముంబైని మళ్లీ కరోనా భయపెడుతున్నది. ముంబై నగరంలో నిన్నటి రోజున 500 లకు పైగా కేసులు నమోదయ్యాయి. జులై 15…
దేశంలోనే అతిపెద్ద సినిమా రంగం బాలీవుడ్! దానికి కేంద్రం ముంబై! కరోనా సెకండ్ వేవ్ తర్వాత వివిధ రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు పునః ప్రారంభమైనా మహారాష్ట్రలో మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో తమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని మహారాష్ట్ర మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు వాపోతున్నారు. నెలకు నాలుగు వందల కోట్ల నష్టం వస్తోందని, గత యేడాది మార్చి నుండి ఇప్పటి వరకూ సుమారు రూ. 4, 200 కోట్ల రూపాయలు లాస్…
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను ముంబయిలోని హీరానంది ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే తల్లి అనారోగ్యంపై సమాచారం అందిన వెంటనే అక్షయ్ కుమార్ హుటాహుటీన లండన్ నుంచి బయలుదేరి ముంబయి చేరుకున్నారు. రాత్రి ముంబై ఎయిరోపోర్టుకు చేరుకున్న అక్షయ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల అక్షయ్ షూటింగ్ కోసం…
చాలా మంది సినీ ప్రముఖులు ఇతర వ్యాపారాల్లో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే.. కథానాయికలు సైతం సైడ్ బిజినెస్ లో మక్కువ చూపిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్స్ బిజినెస్ విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సునీల్ శెట్టి, కరిష్మా కపూర్, శిల్పా శెట్టి, మిథున్ చక్రవర్తి, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ తదితర స్టార్స్ అందరు బిజినెస్ లో సక్సెఫుల్ గా రాణిస్తున్నారు. అయితే, తాజాగా సీనియర్ స్టార్…
ఎవర్ని ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. నమ్ముకున్న వృత్తి వలన మొదట్లో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఎప్పుడోకప్పుడు అదే వృత్తి అతనికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వర్షాకాలం, పైగా సముద్రంలో అలజడి అధికంగా ఉండటంతో గత నెల రోజులుగా సముద్రంలో వేటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నెల రోజుల తరువాత తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో చంద్రకాంత్ అనే మత్స్యకారుడు ముంబై-పాల్ఘర్ సముద్రంలో వేటకు వెళ్లాడు. పదిమందిని తీసుకొని వేటకు…
త్వరలోనే ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఎవర్ని ముంబై మేయర్ అభ్యర్ధిగా ప్రకటించాలి అనే విషయంపై పార్టీ ఓ డాక్యుమెంట్‌ను రూపోందించింది. ఇందులో వ్యాపారవేత్తలు, స్టార్టప్ సీఈవోలు, ప్రముఖ సినీ నటుల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి విలాస్దావు దేశ్ ముఖ్ తనయుడు రితేష్ దేశ్‌ముఖ్, ప్రముఖ సినినటుడు మోడల్ మిలింద్ సోమన్, బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేర్లను కూడా ఆ…
ఐపీఎల్ రెండో దశ సమీపిస్తుండటంతో సందడి పెరుగుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ యూఏఈకి చేరుకున్నాయి. ఐపీఎల్ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్‌లో అడుగుపెట్టింది డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్. ఆరు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని సాధన కూడా మొదలు పెట్టేసింది. రెండోదశలో తన తొలిమ్యాచులో రోహిత్‌సేన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. మూడు రోజుల క్రితమే యూఏఈ చేరుకున్న ధోనీసేన ప్రస్తుతం క్వారంటైన్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 21న, సన్‌రైజర్స్ హైదరాబాద్ 31న అక్కడికి…