అంబానీ ఇంటి దగ్గర అదనపు సెక్యూరిటీ.. ఒకే ఫోన్ కాల్‌తో అలెర్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీకి చెందిన ముంబైలోని నివాసంలో కలకలం రేగింది. ఆయన నివాసానికి అనుమానాస్పద ఫోన్ కాల్స్ రావడంతో అప్రమత్తం అయిన పోలీసులు.. అంబానీ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ముంబైలోని ముకేష్ అంబానీ నివాసం అంటిల్లాకు ఈ రోజు అనుమానాస్పద ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్ అని తేలింది. ఇక, ఇద్దరు వ్యక్తులు ముకేష్ అంబానీ ఇంటికి బ్యాగ్ తీసుకెళ్లాలని కోరారని ఆ ట్యాక్సీ డైవర్ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు టాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్స్‌పై ఆరా తీస్తున్నారు పోలీసులు.. మా ట్యాక్సీ డ్రైవర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. ఇద్దరు వ్యక్తులు ముకేష్ అంబానీ నివాసానికి బ్యాగ్ తీసుకెళ్లాలని కోరారని ఆ డ్రైవర్ మా దర్యాప్తులో చెప్పాడని ముంబై పోలీసులు వెల్లడించారు.. దీంతో.. అంబానీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.. డీసీపీ స్థాయి అధికారితో అంబానీ ఇంటి వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు..
ముకేష్ అంబానీ అంటిల్లా నివాసం చుట్టూ అదనపు బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను పెంచారు పోలీసులు… సీసీటీవీలతో నిఘా పెంచారు… ముంబైలో ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంబానీ నివాసం దగ్గర పోలీసు కమాండోలతో పాటు అదనపు బలగాలను మోహరించారు. కాగా, గతంలో అంబానీ నివాసానికి బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి మాజీ పోలీసు అధికారి సచిన్ వాజ్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఫోన్ కాల్స్‌తో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!