దేశంలో డ్రగ్స్‌పై కఠినమైన నిబంధనలు వున్నా.. పోలీసులు అక్రమ డ్రగ్స్‌పై కొరఢా ఝులిపించినా.. ఇంకా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో రూ. 879 కోట్ల విలువైన భారీ హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతుండటంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. రాయ్ గఢ్ సమీపంలో ఈ హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రబ్ జోత్ సింగ్ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. ఇప్పటికే దేశంలో…
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో భారీ పౌరాణిక చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా 3డి చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామాయణం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన క్యారెక్టర్ రామభక్తుడు హనుమంతుడు. ఈ పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగే పేరు వినిపిస్తోంది.…
ఏదైనా సరే ఒక్కడితోనే మొదలౌతుంది. అతని మార్గాన్ని వేలాది మంది ఫాలో అవుతుంటారు. కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఉద్యోగ, ఉపాది అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలు చేసిన సమయంలో సంపాదించిన మొత్తంతోనే రెండేళ్లుగా ప్రజలు నెట్టుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనాకేసులు తగ్గతుండటంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, పూర్తిస్థాయిలో రవాణా వ్యవస్థ తెరుచుకోలేదు. కేవలం కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. ముఖ్యంగా ముంబై వంటి మహానగరాల్లో సామాన్యులు ప్రయాణం చేసే మెట్రో రైళ్లు తెరుచుకున్నా, ప్రభుత్వ ఉద్యోగులకు, అత్యవసరంగా…
త్వరలో శ్రీలంక పర్యటనకు బయలుదేరే టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ముంబయిలోని ఓ స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉన్నారు. నేటితో వారికి క్వారంటైన్ గడువు ముగుస్తుంది. ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సకల సౌకర్యాలు కల్పించింది. వారికెంతో ఇష్టమైన ‘మాక్‌డక్’ అనే వెజిటేరియన్ రెసిపీని ప్రత్యేకంగా తయారు చేయించింది. అదెలా చేశారనే విషయాన్ని కూడా ఒక వీడియోలో బీసీసీఐ పంచుకుంది. ఈ వీడియోలో ప్రధాన చెఫ్ రాకేశ్ కాంబ్లే తన సిబ్బందిని పరిచయం చేస్తూ వివరంగా ‘మాక్‌డక్’ను ఎలా వండుతారో…
మహారాష్ట్ర కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులతో పాటుగా కొన్ని స్వచ్చంద సేవాసంస్థలు, దేవాలయ ట్రస్ట్‌లు కూడా వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. ముంబైలోని జైన దేవాలయంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేని యాచకులు, పేదలు, వీధి వ్యాపారులకు వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. టీకాలపై అవగాహన కల్పిస్తు, వ్యాక్సిన్ అందిస్తున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆలయంలో వేస్తున్న టీకాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.
ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ వైద్య (98) ముంబైలో అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈయన మనవడు శక్తి అరోరా టీవీ సీరియల్ నటుడు. చంద్రశేఖర్ కుమారుడు ప్రొఫెసర్ అశోక్ చంద్రశేఖర్ తన తండ్రి అంత్యక్రియలను ముంబైలోని విలే పార్లే లో మధ్యాహ్నం పూర్తి చేసినట్టు తెలిపారు. చంద్రశేఖర్ 1923 జూలై 7న హైదరాబాద్ లో జన్మించారు. కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి, ముంబై చేరారు. వెస్ట్రన్ డాన్స్ లో యూకే నుండి డిప్లోమా పొందారు.…
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి అరెస్ట్ అయ్యింది. బర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి గంజాయి సేవిస్తుండగా ఆ నటిని పట్టుకున్నారు ఎన్సీబీ అధికారులు. జూహూలో ఉన్న ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ అషిక్ సాజిద్ తో కలిసి పార్టీ నటి పార్టీ జరుపుకుంటుంది. అయితే గత ఆదివారం తెల్లవారుజామున అధికారులు నటితో పాటి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకోగా… ఘటన…
ఓ వ్యక్తి ఏడు నెలల క్రితం రూ.20 దొంగతనం చేశాడు. ఈ కేసులో మహారాష్ట్ర కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.20 దొంగతనం కేసులో మూడేళ్ల జైలు శిక్ష ఎంటని షాక్ అవ్వకండి. దొంగతనం చేసే సమయంలో బాధితుడికి గాయాలయ్యాయి. ఏడేళ్లుగా జైలులో నిందితుడు ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సమయంలో తాను నేరం చేసినట్టుగా ఒప్పుకుంటూ కోర్టుకు లేఖ రాశాడు. నేరం ఒప్పుకోవడంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. ఐపీసీ…
ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు పదేళ్ జైలు శిక్ష విధించింది.. ముజామిల్, సాదిక్, అక్రం అనే లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు.. హిందూ నేతలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారని.. వీరిని 2012లో అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్రలు కూడా చేసినట్టు నిర్ధారించారు.. సౌదీలో శిక్షణ తీసుకున్న అక్రం… హైదరాబద్ కు చెందిన…
ఆమె ఛార్మి. ఈమేమో ఛార్మింగ్ బ్యూటీ. ఇద్దరి చేతుల్లో చూడ చక్కని పెట్ డాగ్స్! ఇంతకీ, ఈ సీన్ ఎక్కడా అంటారా? ముంబైలో! ఛార్మి కౌర్, రశ్మిక మందణ్ణ ఎదురు పడ్డారు. సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, చుట్టూ ఉన్న వార్ని ఆకర్షించింది, కెమెరాల్ని ఉత్సాహపరిచింది మాత్రం ఈ బ్యూటీస్ ఇద్దరి చేతుల్లోని క్యూటీసే! ఛార్మి చేతుల్లో ఆమె తెల్లటి పెంపుడు కుక్క ఉండగా… రశ్మిక చేతుల్లో తన న్యూ బ్రౌనీ పెట్ కనిపించింది…సినిమా హీరోయిన్స్ కి పెట్…