పాకిస్తాన్‌కు చెందిన ఓ న్యూస్ ఛానల్‌లో అభివృద్ధిపై చర్చను నిర్వహిస్తున్నారు. న్యూస్ యాంకర్ అల్వీనా అఘా ఆ దేశానికి చెందిన ఖ్వాజా నవీద్ అహ్మద్‌ను అభివృద్ధి సమస్యలపై ప్రశ్నిస్తున్నది. దేశంలో అభివృద్ధి ఎలా జరుగుతున్నది. మిగతా దేశాలతో పోల్చితే పాక్ వెనకబడిపోవడానికి కారణం ఏంటి వంటి విషయాలపై చర్చిస్తున్నారు. అభివృద్ధిపై మాట్లాడుతు ఖ్వాజా ఇండియాలోని అరటిపండ్ల విషయాన్ని తీసుకొచ్చారు. ఇండియాలోని అరటిపండ్లు పొడవుగా ఉంటాయని, అటు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో పండే అరటిపండ్లు కూడా పొడవుగా ఉంటాయని, కానీ పాక్‌లోని సింథ్ ప్రాంతంలో చాలా చిన్న అరటిపండ్లు మాత్రమే పెరుగుతాయని అన్నాడు.
Read: ఎన్నికల ప్రభావం: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు…
దీంతో యాంకర్ నవ్వేసింది. పాక్ లో పెరిగే చిన్న అరటిపండ్లపై లోతైన పరిశోధన జరగాలని ఖ్వాజా చెప్పడంతో యాంకర్ అల్వీనా నవ్వు ఆపుకోలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ కాగా ఒక్కసారిగా వైరల్ అయింది. పాక్ ఛానల్‌లో ఇండియా అరటి పండు అని, అరటిపండ్ల విషయంలో కూడా ఇండియా విజయం సాధించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నవంబర్ 1 న పోస్టైన ఈ వీడియోను 5.13 లక్షల మందికి పైగా వీక్షించారు.
And the winner is, Bombay 🍌 pic.twitter.com/wJB8lqzODa
— Naila Inayat (@nailainayat) November 1, 2021