మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ముంబై నగరంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో ముంబైలో 144 సెక్షన్ విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ కేసులను నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 30 నుంచి జనవరి 7 వరకు ముంబైలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. Read Also: జనవరి 2 వరకు ఆంక్షలు.. డీజీపీ కీలక ఆదేశాలు ఈ నేపథ్యంలో…
2021 మరికొద్దిగంటల్లో కనుమరుగు కానుంది. అయితే యువత మాత్రం 2021ని సాగనంపుతూ.. 2022కి గ్రాండ్ వెల్కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. కరోనా, ఒమిక్రాన్ ఏమున్నా జాన్తా నై అంటూ వేడుకలకు రెడీ అయిపోతున్నారు. ఆంక్షల బందీఖానా నుంచి వారు బయటపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలలో ఏటా డ్రగ్స్ విచ్చలవిడిగా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వస్తుంటాయి. ఈసారి కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ , గంజాయి విక్రయాలు జరుగుతాయని పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా…
ముంబైలో కరోనా కేసులు భయపెడుతున్నాయి. మొన్నటి వరకు వందల్లో నమోదైన కేసులు నిన్నటి నుంచి వేలల్లో నమోదు కావడం మొదలుపెట్టాయి. సోమవారం రోజున 800 కేసులు నమోదవ్వగా, మంగళవారం రోజున 1300 కేసులు నమోదయ్యాయి. బుధవారం రోజున 2 వేలకు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనిపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా థాకరే అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రెండు రోజుల వ్యవధిలో 70 శాతం మేర కేసులు పెరగడంతో ప్రజలు…
మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. కరోనా, ఒమిక్రాన్ నిబంధనలను పాటిస్తూ డిసెంబర్ 22 నుంచి 28 వరకు మొత్తం 5 రోజులపాటు సమావేశాలను నిర్వహించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నాగపూర్లో నిర్వహించాల్సి ఉన్నా, ఒమిక్రాన్ కారణంగా ఈ సమావేశాలను ముంబైలోనే నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల సమయంలో 50 మంది కరోనా బారిన పడినట్టు మహా ఉప ముఖ్యమంత్రి పవార్ తెలిపారు. మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్, మరో మంత్రి…
దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకు పెరుగుతున్నది. ఒమిక్రాన్ కేసులు పెరిగే కొలది కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆరునెలల తరువాత మరలా ఢిల్లీ, ముంబై లో కేసులు పెరుగుతుండటంతో దేశం అప్రమత్తం అయింది. శనివారం రోజున ఢిల్లీలో 38శాతం కేసులు పెరగ్గా, ముంబైలో 10శాతం కేసులు పెరిగాయి. ఢిల్లీలో శనివారం రోజున 249 కొత్త కేసులు నమోదవ్వగా, ముంబైలో 757 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ముంబైలో నైట్ కర్ఫ్యూతో…
యువతకు బైక్ లంటే ఎంతో పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మార్కెట్ లోకి కొత్త మోడల్ వచ్చిందంటే.. దాన్ని ఎంత ఖర్చుపెట్టి అయినా సొంతం చేసుకుంటారు. ఆ బండిపై రోడ్లపై విన్యాసాలు చేస్తూ తిరుగుతారు. ఇక వెనుక ప్రేమించిన అమ్మాయి కూడా ఉంటె .. గాల్లో తేలినట్టుందే అంటూ సాంగ్స్ వేసుకొని రెచ్చిపోతారు. తాజాగా ఒక కుర్రాడు కూడా అదే పని చేశాడు. కానీ, చివరికి హాస్పిటల్ పాలయ్యాడు. అతివేగంతో బైక్ ఫై స్టంట్ లు…
ఆర్థిక రాజధాని ముంబాయిలో ఇకనుంచి సరికొత్త రవాణాకు మహారాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైలు, బస్, విమానాలతో పాటు నాలుగో రవాణా సదుపాయంగా వాటర్ టాక్సీ సర్వీసులను నడిపేందుకు అవసరమైన ప్రణాళికలను మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వాటర్ ట్యాక్సీలను మూడు ఆపరేటర్ సంస్థలు నిర్వహించనున్నాయి. దక్షిణ ముంబయి నుండి నవీ ముంబయి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం వాటర్…
ముంబైలో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 7 న ‘ట్రిపుల్ ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఇటీవల ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన రాజమౌళి.. బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ లు ఇస్తూ బిజీగా మారిపోయారు. రామ్ చరణ్, తారక్, రాజమౌళి ముంబైలో ఇంటర్వ్యూలో పాల్గొన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ ‘ఆర్ఆర్ఆర్’ త్రయంలో మరో ఆర్ కలిసింది. అదేనండీ ఈ ట్రిపుల్ ఆర్…
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు త్రయం కాంబోలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లను వేగంవంతం చేశారు చిత్ర బృందం. ఇటీవల అన్ని భాషల్లోనూ ప్రెస్ మీట్స్ పెట్టిన జక్కన్న ఎక్కువగా హిందీ మీడియా మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్…
‘గీతాగోవిందం’ చిత్రంతో ప్రేక్షకులకు లవ్ బర్డ్స్ లా మారిపోయారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా అభిమానులకు ఆనందమే.. మేమిద్దరమే మంచి స్నేహితులమే అని చెప్పుకొని వీరు తిరుగుతున్నా.. వీరి మధ్య ఇంకేదో ఉందని నెటిజన్లు నొక్కి వక్కాణిస్తున్నారు. బయట ఈ జంట ఎక్కడ కనిపించినా కెమెరాలకు పనిచెప్తున్నారు మీడియా వారు. ఇక తాజగా ఈ రౌడీ జంట ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’…