ప్రభుత్వాలు మారడం.. ప్రభుత్వంలో ఉన్న పార్టీ.. ప్రతిపక్షంలో కూర్చోవడం.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాస్తా అధికార పగ్గాలు చేపట్టడం జరిగిపోతూనే ఉంటాయి.. అయితే, తమ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని సమస్యలను కూడా.. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారు లేవనెత్తి విమర్శలు చేస్తుంటారు.. ఇప్పుడు మహారాష్ట్రలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి.. అసలు విషయానికి వస్తే.. ముంబై ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన ఆమె.. ఓ వింత వాదనను తెరపైకి తెచ్చారు.. మహిళలు విడాకులు తీసుకోవానికి ట్రాఫిక్ కూడా ఓ కారణంగా సెలవిచ్చారు.
Read Also: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ…
ముంబైలో ట్రాఫిక్ కారణంగానే 3 శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు అమృత ఫడ్నవీస్.. తాను దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అనే విషయం మరచిపోండి. కానీ, నేను ఓ మహిళగా మాట్లాడుతున్న.. ఆర్థిక రాజధానిలో గుంతలు, ట్రాఫిక్‌తో తాను కూడా వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపారు.. ట్రాఫిక్ కారణంగానే కుటుంబంతో గడిపే సమయం కూడా తగ్గిపోవడంతో.. చాలామంది విడాకులు తీసుకుంటున్నారని ఓ వింత లాజిక్‌ను తెరపైకి తెచ్చారామె.. మరోవైపు.. నెటిజన్లు అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు.. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది.. ఆమె పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే.. సోషల్ మీడియా వేదికగా ఆమె చెప్పిన లాజిక్‌పై మండిపడ్డారు.. ట్రాఫిక్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారన్న మహిళకు ది బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే అవార్డును అందజేయాలంటూ చురకలు అంటించారు.