మెగాస్టార్ కూతురు శ్రీజ, కొడుకు రామ్ చరణ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారన్న విషయం తెలిసిందే. శ్రీజ కొణిదెల ఇప్పుడు సోదరుడు రామ్ చరణ్ తో కలిసిప్రైవేట్ విమానంలో ముంబైకి వెళ్ళినప్పుడు తీసుకున్న అద్భుతమైన ఫోటోలను పంచుకున్నారు. రామ్ చరణ్, వారి పెంపుడు కుక్క రైమ్‌తో ఉన్న రెండు ఫోటోలను పంచుకుంటూ శ్రీజ దానికి క్యాప్షన్ గా “కౌగిలింతలు మరియు కౌగిలింతలు… నేను జీవించి ఉన్నందుకు సంతోషించే చిన్న విషయాలు” అని ఇచ్చింది.
Read Also : నా భర్తకు కూడా సామ్ హాట్ గా కన్పించింది : ప్రియమణి
ఇటీవల శ్రీజ కొణిదెల తన భర్త, నటుడు కళ్యాణ్ దేవ్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల నుండి తన భర్త ఇంటిపేరు దేవ్‌ను తొలగించిన తర్వాత ఈ రూమర్లు స్టార్ట్ అయ్యాయి. ఒకరినొకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారు. కొణిదెల కుటుంబం వీరి విడాకుల విషయంపై ఇంకా స్పందించలేదు. శ్రీజ తాజా పోస్ట్ చూస్తుంటే రామ్ చరణ్, కుటుంబం తనకు అండగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్టు కన్పిస్తోంది. శ్రీజ కొణిదెల ఇద్దరు కుమార్తెల తల్లి. మొదటి కుమార్తె నివ్రతి, కళ్యాణ్ దేవ్ పాప నవిష్క.

