ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్స్ అంతా ముంబైలోనే ఎక్కువగా కన్పిస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్యతో కలిసి బాలీవుడ్ పాపులర్ డిజైనర్ ఇంట్లో కన్పించగా… ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ను ముందుగా విడుదల చేయాలని అనుకున్నప్పటి నుంచీ చరణ్ తరచుగా ముంబైలో దిగుతున్నారు. ఇటీవలే సోదరి శ్రీజాతో కలిసి అక్కడికి వెళ్లిన చెర్రీ మరోసారి తన భార్య ఉపాసన కామినేనితో కలిసి దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంట ముంబైలో ఉన్నారు. మంగళవారం ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా నివాసంలో ఈ స్టైలిష్ జంటను కెమెరాల్లో బంధించారు ఛాయాచిత్రకారులు.
Read Also : బాలయ్య షో రికార్డ్స్ ‘అన్‌స్టాపబుల్’
ఈ జంట మల్హోత్రా నివాసానికి గెట్ టు గెదర్ పార్టీ కోసం వెళ్లినట్టు తెలుస్తోంది. చెర్రీ, ఉపాసన స్టైలిష్ లుక్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫోటోలలో రామ్ చరణ్ మొత్తం నలుపు రంగు దుస్తులను ధరించి, తెల్లటి షూస్ తో ఎప్పటిలాగే హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఉపాసన ఎరుపు రంగు పూల ప్రింట్ ఉన్న తెల్లటి దుస్తులు, వాటికి మ్యాచింగ్ గా బ్రౌన్ న్యూడ్ కలర్ హీల్స్ ధరించి అద్భుతంగా కనిపించింది.