ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం జలమయం అయింది. రహదారులు చెరువులను తలపించడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Balakrishna: ప్రముఖ సినీ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. గత 77 సంవత్సరాలుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తన గొప్ప చరిత్రతో విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి…
గణేష్ నిమజ్జనం వేళ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ బాంబ్ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 34 వాహనాల్లో ఆర్డీఎక్స్ పెట్టినట్లుగా వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు వచ్చింది.
బాలీవుడ్ జంట అలియా భట్, రణబీర్ కపూర్లు త్వరలో ముంబైలోని తమ కొత్త బంగ్లాలోకి మారనున్నారు. రణబీర్ తాత రాజ్ కపూర్ కు చెందిన కృష్ణ రాజ్ ప్రాపర్టీలో నిర్మించిన ఈ ఆరు అంతస్తుల భవనానికి ‘కృష్ణ రాజ్’ అని పేరు పెట్టారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలోనే రణబీర్ కూతురు రాహాతో కలిసి గృహప్రవేశం చేయాలని కుటుంబం భావిస్తోంది. అయితే, ఈ ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో…
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత నాలుగు రోజులుగా ముంబైను వరుణుడు వదిలిపెట్టడం లేదు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోంది.
ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే గణపయ్య భక్తులు విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. ఊరు వాడలు వినాయక మండపాలతో ముస్తాబవుతున్నాయి. కాగా గణేష్ వేడుకలకు ముందే ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ హాట్ టాపిక్ గా మారింది. తమ వినాయకుడికి ఏకంగా రూ. 474 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంది. దీంతో రిచెస్ట్ గణపతిగా రికార్డ్ సృష్టించాడు. గతేడాది కూడా రికార్డ్ స్థాయిలో రూ. 400 కోట్లు, 2023లో రూ.…
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది.
దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులు సైబర్ వలలో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో కోట్లాది రూపాయలు పోగొట్టుకుని లబోదిబో అంటున్నారు.
దేశ వ్యాప్తంగా వరుస విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం పెడుతున్నాయి. ప్రొఫెసర్ వేధింపులు కారణంగా ఒడిశాలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.