దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరిగాయి. రోజు రోజు కోవిడ్ కేసులు పెరగడంతో ప్రజల్లో భయాందోళన మొదలవుతోంది. నిన్నామొన్నటిదాకా వందల్లో ఉన్న కేసులు.. ఇప్పుడు వేలల్లోకి చేరుకుంది.
ఒకపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వకముందు మొదలుపెట్టిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆయన ముంబైలో ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. Also Read:Sandeep vs Deepika: స్పిరిట్…
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఇక ముంబైలో కొత్తగా ప్రారంభించిన వర్లి భూగర్భ మెట్రో స్టేషన్ వరదల్లో మునిగిపోయింది.
భారతదేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. మళ్లీ చాపకింద నీరులా పాకుతోంది. కోవిడ్ పూర్తిగా అంతరించిపోయిందన్న భావనలో ఉన్న ప్రజలకు మళ్లీ షాకిస్తోంది. కొత్త వేరియంట్రూపంలో ప్రజలకు దడ పుట్టిస్తోంది.
భారత్లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేరళ, ముంబై, ఢిల్లీలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి.
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
Mumbai: తల్లి అనే పదానికి మాయని మచ్చని తీసుకువచ్చింది ఓ మహిళ. తన ముందే, తన బిడ్డపై అత్యాచారం చేస్తున్నా చూస్తూ ఉండిపోయింది. తన రెండున్నరేళ్ల కూతురు చనిపోతున్నా పట్టించుకోలేదు. ఈ ఘటన ముంబైలోని మాల్వానీ ప్రాంతంలో జరిగింది. నిందితుడు, సదరు మహిళ ప్రియుడిగా తేలింది. ఈ కేసులో ముంబై పోలీసులు రీనా షేక్ అనే మహిళతో పాటు, ఆమె లవర్ ఫర్హాన్ షేక్ని అరెస్ట్ చేశారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నటుడి ఇంట్లో దొరికిన వేలిముద్రలు.. నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహాజాద్తో సరిపోవడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. న్యాయస్థానంలో పోలీసులు సమర్పించిన ఛార్జ్షీట్లో ఈ మేరకు పేర్కొన్నారు.
మహారాష్ట్రలో దారుణంగా జరిగింది. ఒక రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ మురళీధర్ రామచంద్ర జోషి(80) తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య లత (76)ను చంపి.. అనంతరం జోషి ఆత్మహత్య చేసుకున్నాడు.