Mumbai: తొలి వివాహ వార్షికోత్సవానికి ముందు మహిళ మృతి.. ఏం జరిగిందంటే..!
- మహారాష్ట్రలో మరో దారుణం
- ముంబైలో మహిళ మృతి
- తొలి వివాహ వార్షికోత్సవానికి ముందు మహిళ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో వైద్యురాలి మరణాన్ని మరువక ముందే మరో అబల బలైపోయింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట వేధింపులకు నారీమణులు బలైపోతున్నారు. ముంబైలో తొలి వివాహ వార్షికోత్సవానికి ముందు మహిళ మృతి చెందింది.
ముంబైలోని వెస్ట్ ఖార్‌కు చెందిన 24 ఏళ్ల నేహా గుప్తా, అరవింద్ గుప్తాకు నవంబర్ 16, 2024న వివాహం జరిగింది. ఇంకో కొద్ది రోజుల్లో తొలి వివాహ వార్షికోత్సవం జరుపుకోవాలి. కానీ ఇంతలోనే శవమైంది. అక్టోబర్ 16న రాత్రి నేహా గుప్తాను అత్తింటి వారు ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటల తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. కానీ వెంటనే కొన్ని గంటల్లోనే రెండోసారి ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ఈసారి చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ఇది కూడా చదవండి: Doctor Death Case: వైద్యురాలి ఆత్మహత్యకు ముందు ఇంత జరిగిందా? వెలుగులోకి డెత్ మిస్టరీ
తొలి వివాహ వార్షికోత్సవం చేసుకోవడానికి సిద్ధపడుతున్న తరుణంలో కుమార్తె మరణవార్త తెలిసి తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. నేహా గుప్తా అంతక ముందే తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి బాగోలేదని.. విషం ఇస్తున్నారని.. భర్త, అతని కుటుంబ సభ్యులు వరకట్నం కోసం వేధిస్తున్నారని వాపోయింది. ఇంతలోనే నేహా గుప్తా చనిపోయినట్లు రావడంతో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది. భర్త, అత్తమామల వేధింపులతో కుమార్తెను చంపేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త, ఐదుగురు కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. నిందితులపై వరకట్న వేధింపులు, విషప్రయోగం, హత్య కింద కేసులు నమోదు చేశారు. ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయని.. రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అరవింద్ గుప్తా.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జన్మించి ముంబైలో బ్యాంకు అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వివాహం జరిగిన కొద్దికాలానికే నేహా గుప్తాపై వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె తండ్రి రాధేశ్యామ్ గుప్తా పోలీసులకు తెలిపారు.
నేహా గుప్తా తండ్రి రాధేశ్యామ్ గుప్తా మాట్లాడుతూ.. తన అల్లుడికి రూ.28 లక్షల విలువైన బంగారం, రూ.9 లక్షల నగదు, గృహోపకరణాలు, బహుమతులు ఇచ్చినట్లు తెలిపాడు. ఖరీదైన బహుమతులను కట్నంగా పరిగణించలేదని.. ఎందుకంటే చట్టవిరుద్ధం కాబట్టి అలాగే ఇవ్వాల్సి వచ్చిందని తెలిపాడు. ఇవన్నీ ఇచ్చినా నిత్యం తమ కుమార్తెను అదనపు కట్నం కోసం వేధించారని వాపోయాడు. ఇంకా డబ్బు, ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ ఇవ్వాలని కోరినట్లు తెలిపాడు. అందుకు నిరాకరించడంతో వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయాడు. నేహా గుప్తాపై విషప్రయోగం జరిగిందని.. ఆహారంలో మాదకద్రవ్యాలు కలిపి ఉండటం వల్ల పదేపదే మూర్ఛపోయేలా చేశారని పేర్కొన్నాడు. చాలా సార్లు వింతగా, మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు కనిపించిందని వెల్లడించాడు. బలవంతంగా గర్భస్రావం కూడా చేయించారని చెప్పాడు.
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!