Happiest City: ఆసియాలో ‘‘అత్యంత సంతోషకరమైన నగరం’’గా భారతీయ నగరం నిలిచింది. టైమ్ అవుట్ నిర్వహించిన కొత్త సర్వే ప్రకారం, ముంబై 2025గానూ ఈ టైటిల్‌ను గెలుచుకుంది. పట్టణవాసులు తమ పరిసరాలు, జీవనశైలి, సమాజాల గురించి ఎలా భావిస్తున్నారో అంచనా వేయడానికి ప్రధాన నగరాల్లో 18,000 మందికి పైగా నివాసితులను వార్షిక సర్వే చేసింది. కల్చర్, ఆహారం, నైట్ లైఫ్, జీవన నాణ్యతతో సహా అనేక అంశాల ఆధారంగా సర్వేలో పాల్గొన్న వారు తమ నగరాలకు రేటింగ్ ఇచ్చారు.
ముంబైలోని నివాసితులు 94 శాతం మంది తమ నగరం తమకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. 89 శాతం తాము ఇంతకుముందు నివసించిన ప్రాంతం కన్నా ముంబై సంతోషంగా ఉందని వెల్లడించారు. 88 శాతం మంది నగరంలో ప్రజలు సంతోషంగా ఉన్నట్లు భావిస్తున్నారు. 87 శాతం మంది ఇటీవల కాలంలో నగరంలో ఆనందం పెరిగిందని చెప్పారు. ముంబైలో అభివృద్ధి చెందిన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, కెరీర్ అవకాశాలు, ఉత్సాహభరితమైన స్ట్రీట్ ఫుడ్ కల్చర్ నగరాన్ని ఈ టైటిల్ రేసులో ముందుంచింది.
టైమ్ అవుట్ ప్రకారం 2025కి ఆసియాలోని టాప్ 10 సంతోషకరమైన నగరాలు:
1. ముంబై, భారతదేశం
2. బీజింగ్, చైనా
3. షాంఘై, చైనా
4. చియాంగ్ మై, థాయిలాండ్
5. హనోయ్, వియత్నాం
6. జకార్తా, ఇండోనేషియా
7. హాంకాంగ్
8. బ్యాంకాక్, థాయిలాండ్
9. సింగపూర్
10. సియోల్, దక్షిణ కొరియా
అనూహ్యంగా ఆసియాలో అతిపెద్ద నగరాలైన సియోల్, సింగపూర్, టోక్యోతో సహా అనేక సిటీలు ఈ జాబితాలో చోటు సంపాదించుకోకపోవడం గమనార్హం.