Mumbai: ముంబైలో నకిలీ శాస్త్రవేత్త అరెస్ట్.. అణు డేటా ఉన్నట్లుగా అనుమానాలు!
- ముంబైలో నకిలీ శాస్త్రవేత్త అరెస్ట్
- అణు డేటా ఉన్నట్లుగా అనుమానాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో నకిలీ అణు శాస్త్రవేత్త అలెగ్జాండర్ పామర్ అలియాస్ అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేనిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం వెర్సోవాలో అరెస్ట్ చేశారు. వివిధ పేర్లతో శాస్త్రవేత్తగా చెలామణి అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇతడి దగ్గర అణు డేటా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Jinping: ట్రంప్-జిన్‌పింగ్ భేటీ వేళ చైనాకు ఊరట.. సుంకాలు తగ్గింపు
Also Read
- Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
- Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
- Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
- Lok Sabha: ఫలించిన స్పీకర్ చొరవ.. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై రేపు చర్చ
దేశంలోని ప్రముఖ అణు పరిశోధనా విభాగమైన భాభా అణు పరిశోధనా కేంద్రం (BARC)లో నకిలీ శాస్త్రవేత్తగా ఉన్నట్లు గుర్తించారు. ఇతడి దగ్గర అణు డేటా, డజన్ల కొద్దీ మ్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. పత్రాల్లో ఏదైనా సున్నితమైన, గోప్యమైన అణు సమాచారం ఉందో.. లేదో తెలుసుకునేందుకు పరిశీలిస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Bhopal: భోపాల్‌లో కిలాడీ డీఎస్పీ.. స్నేహితురాలి ఇంటికొచ్చి ఏం చేసిందంటే..!
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విచారణలో అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేని (60) నుంచి కీలక సమాచారం రాబట్టారు. జార్ఖండ్‌కు చెందిన మునాజిల్ ఖాన్ అనే కన్సల్టెన్సీ దగ్గర నుంచి ఆధార్, పాన్, ఇతర పత్రాలను పొందినట్లుగా కనుగొన్నారు. 2016లో కేవలం రూ.19,000లకే ఈ గుర్తింపులు పొందినట్లుగా తెలుస్తోంది. దీంతో అక్తర్ పూర్తిగా కొత్త వ్యక్తిగా చెలామణి అవుతున్నట్లుగా గుర్తించారు. మొత్తానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వల పన్ని మునాజిల్ ఖాన్‌ను అక్టోబర్ 25న అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Bengaluru: అమానుషం.. రోడ్డుపై చిన్న ప్రమాదానికే యువకుడి ప్రాణం తీసిన దంపతులు
గత కొన్ని నెలలుగా అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేని అనేక అంతర్జాతీయ కాల్స్ చేశాడని వర్గాలు సూచించాయి. కాల్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. అనుమానిత అణు డేటాను విదేశీ నెట్‌వర్క్‌లతో పంచుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్తర్ మారు వేషంలో జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా కనిపెట్టారు. 2004లో రహస్య పత్రాలతో శాస్త్రవేత్త అని చెప్పుకున్న ఇతడ్ని దుబాయ్ నుంచి బహిష్కరించారు. బహిష్కరణ తర్వాత కూడా నకిలీ పాస్‌పోర్ట్‌లు ఉపయోగించి పలుమార్లు దుబాయ్, టెహ్రాన్, ఇతర ప్రదేశాలకు ప్రయాణం చేసినట్లు గుర్తించారు.
జార్ఖండ్ నివాసి అయిన మునాజిల్ ఖాన్.. అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేని సోదరుడి కోసం రెండు పాస్‌పోర్ట్‌లను నకిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పాస్‌పోర్ట్‌ల్లో చూపించిన చిరునామా జంషెడ్‌పూర్‌లోని ఒక ఇంటికి చెందినది. ఇది అక్తర్ తండ్రి మరణం తర్వాత దాదాపు 30 సంవత్సరాల క్రితం విక్రయించారు. ఈ పాస్‌పోర్ట్‌లు హుస్సేని మొహమ్మద్ ఆదిల్, నసీముద్దీన్ సయ్యద్ ఆదిల్ హుస్సేని పేర్లపై ఉన్నాయి. అక్తర్, అతని సోదరుడు ఆదిల్ ఇద్దరూ విదేశాలకు వెళ్లడానికి నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్నారు. అక్తర్ సోదరుడు ఆదిల్ హుస్సేనీని ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతనే మునాజిల్ ఖాన్‌కు అక్తర్‌ను పరిచయం చేసినట్లు సమాచారం. ఇక పోలీసులను తప్పుదారి పట్టించడానికి.. అక్తర్ హుస్సేని విచారణ సమయంలో తన సోదరుడు చనిపోయి చాలా కాలం అయిందని అబద్ధం చెప్పాడు.
ఇక దర్యాప్తులో ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మునాజిల్ ఖాన్ సోదరుడు ఇలియాస్ ఖాన్ కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తేలింది. ప్రస్తుతం అతన్ని వాంటెడ్‌గా ప్రకటించారు. ఇలియాస్ ఖాన్.. అక్తర్ హుస్సేనిన్‌కు పాఠశాల, కళాశాల డిగ్రీలతో సహా నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను అందించాడని ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Sridevi: వర్షంలో 15 ఏళ్ల శ్రీదేవితో 55 ఏళ్ల హీరో రొమాన్స్ .. అప్పట్లో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ సాంగ్ ఏంటో తెలుసా ?
-
Speed Post New Rates: తపాలా శాఖ కీలక ప్రకటన.. స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త ధరలు.. లేఖలు, పార్శిల్స్ పై కొత్త నిబంధనలు
-
Vaibhav Sooryavanshi-BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. బీసీసీఐకి పెద్ద తలనొప్పి!
-
3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన ‘మొఘల్-ఎ-ఆజమ్’ పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
ట్రెండింగ్
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్‌ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!