Shah Rukh Khan: షారూఖ్‌ఖాన్ మార్కుల షీట్ వైరల్.. మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులొచ్చాయంటే..!
- సోషల్ మీడియాలో షారూఖ్ ఖార్ మార్కుల షీట్ వైరల్
- సినిమాల్లోనే కాదు.. చదువులోనూ రాణించిన బాలీవుడ్ హీరో
- మ్యాథ్స్, ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించిన ఐకాన్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షారూఖ్ ఖాన్.. బాలీవుడ్ సూపర్‌స్టార్. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రపంచ ఐకాన్‌గా పేరు గడించారు. ఇంత స్టార్‌డమ్ సంపాదించిన బాలీవుడ్ హీరో చదువులోనూ బాగానే రాణించారు. ఇందుకు సంబంధించిన ఒక మార్కుల షీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తమ అభిమాన హీరో సాధించిన మార్కులు చూసి మురిసిపోతున్నారు.

Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
షారూఖ్ ఖాన్.. సినిమాల్లోనే కాదు.. చదువులోనూ మంచి ప్రతిభ కనబరిచినట్లుగా తెలుస్తోంది. పాఠశాల, కళాశాల చదువులో మంచి మార్కులు సంపాదించినట్లుగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన మార్కుల షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో 78 మార్కులు సాధించినట్లుగా కనిపించింది. అలాగే మిగతా సబ్జెక్ట్‌ల్లోనూ మంచి మార్కులే వచ్చాయి. ఇంగ్లీష్ పేపర్‌లో 51 మార్కులు సాధించారు.
ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీలో 1985-1988 మధ్య షారూఖ్ ఖాన్ ఆర్థికశాస్త్రం అభ్యసించారు. ఇక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అనంతరం జామియా మిలియా ఇస్లామియాలో మాస్ కమ్యూనికేషన్ చదివేందుకు వెళ్లారు. ఇక్కడే జీవితం టర్నింగ్ పాయింట్ అయింది. అనూహ్యంగా షారూఖ్ ఖాన్‌కు సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తొలుత టెలివిజన్ పాత్రల ద్వారా ఎంట్రీ ఇచ్చి.. అనంతరం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. దీంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చారు. 1992లో దీవానా సినిమాతో షారుఖ్ ఖాన్ తెరంగేట్రం చేశారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్‌లతో కలిసి ‘కింగ్’ సినిమాలో నటిస్తున్నారు.
షారూఖ్ ఖాన్ మొదటి నుంచి తెలివైన విద్యార్థిగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయనకు క్రీడాలంటే కూడా చాలా మక్కువ. అయితే మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఆ రంగంలోకే ప్రవేశించి రాణించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్కుల షీట్‌ను మీరు కూడా చూసేయండి.
SRK's College Marksheet #SRK @iamsrk pic.twitter.com/P4aPRQ7ZaV
— Dr. Curious ❇️ (@Dr_Curiosus) November 12, 2025
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!