Today Gold and Silver Rates: గత కొద్దీ కాలంగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులు భారీగా తగ్గి ఆ తర్వాత రెండు రోజులు స్థిరంగా కొనసాగింది. అయితే , నేడు (మంగళవారం) దేశ వ్యాప్తంగా స్వల్ప పెరుగుదల కనిపించింది. నేడు హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక తులం పై…
ముంబైలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వర్లీ ప్రాంతంలోని అన్నీ బిసెంట్ రోడ్డులోని అట్రియా మాల్ ఎదురుగా ఉన్న పూనమ్ ఛాంబర్స్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే 10 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్నాయి. అనంతరం.. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Ganja Seized : మెదక్ జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగిలోని ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి భారీ ఎత్తున గంజాయి తరలిస్తుండగా, పూణె , గోవా రాష్ట్రాల డిఆర్ఐ స్పెషల్ ఫోర్స్ అధికారులు లారీని వెంబడించి పట్టుకున్నారు. తమను పోలీసులు వెంబడిస్తున్నట్లు గమనించిన లారీ డ్రైవర్ చాకచక్యంగా చెక్పోస్ట్ వద్ద లారీ ఆపి, కాగితాలు చూపించిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. లారీ వద్ద ఉన్న డిఆర్ఐ అధికారులు…
RBI Receives Bomb Threat: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ కు ఈ మెయిల్ ద్వారా పంపిన బెదిరింపుల్లో బ్యాంకును పేల్చివేస్తామంటూ రష్యన్ భాషలో గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని పంపించారు.
ముంబైలోని కుర్లాలో ఎస్జీ బార్వేరోడ్లో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకుపోగా.. ప్రమాదంలో నలుగురు మృతులు శివమ్ కశ్యప్, కనీజ్ ఫాతిమా, అఫీల్ షా, అనమ్ షేక్ లు చనిపోగా.. మరో 29మంది తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటకలోని బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన(యూబీటీ) నేత, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోడీని కోరారు. బెలగావిలో మరాఠా మాట్లాడే ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామని ముంబై పోలీసులకు శనివారం బెదిరింపు మెసేజ్లు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. అజ్మీర్కి చెందిన ఓ నెంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు గుర్తించామని, నిందితుడిని పట్టుకునేందుకు అక్కడికి పోలీస్ టీంలను పంపామని అధికారి తెలిపారు.