New Year Celebrations: 2025 సంవత్సరంలోకి ప్రపంచ దేశాలు అడుగు పెట్టాయి. నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు ఆనందోత్సాహాలతో బాణాసంచా కాల్చుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రజలు కేక్ కట్ చేస్తూ ఆనందంగా గడిపారు. చాలామంది భక్తులు దేవాలయాలను సందర్శించడం ద్వారా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారు. పుణ్యస్నానాలు చేస్తూ, గడ్డకట్టే చలిని పట్టించుకోకుండా తెల్లవారు జామునుంచే గుడుల ముందు బారులు తీరి నిలిచారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. దేశంలోని ముఖ్యమైన దేవాలయాలు కాశీ విశ్వనాథుడి ఆలయం, అయోధ్య రామమందిరం, ఉజ్జయినీ మహాకాళేశ్వరుడు, పూరీ జగన్నాథుడు, మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి.
Also Read: Minister Ratnesh Sada: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మంత్రిని ఢీకొన్న ఆటో..
Honking in the new! The tradition of all trains honking together at 12 midnight to welcome and salute the New Year at Mumbai CSMT station & rail car-sheds continues. Happy New Year 2024. Courtesy respective owner. pic.twitter.com/8hiChEOxYC
— Rajendra B. Aklekar (@rajtoday) December 31, 2024
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఉత్సాహం కనిపించింది. తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, వేములవాడ, భద్రాచలం వంటి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ ఏడాది శుభం కలగాలంటూ భక్తులు ప్రార్థనలు చేశారు. అయితే, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌లో రైల్వే అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు కలిసి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌లో ఉన్న డిజిటల్ క్లాక్ అర్ధరాత్రి 12 గంటలు చూపగానే స్టేషన్ లో ఉన్న రైళ్ల హారన్లు ఒక్కసారిగా మోగించారు. ఈ సంఘటనను ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.