కన్నతల్లినే అతి కిరాతకంగా హత్య చేసిందో కూతురు. కనికరం కూడా లేకుండా.. ఆగ్రహంతో క్రూరాతి క్రూరంగా అమ్మను హత్య చేసింది. ముంబైలోని కుర్లాలో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితురాలిని 41 ఏళ్ల రేష్మా ముజఫర్ ఖాజీగా గుర్తించారు. ఆమె తల్లి సబీరా బానో(62). ముంబ్రాలో తన కుమారుడితో కలిసి నివసిస్తున్న సబీరా బానో.. గురువారం ఖురేషీ నగర్‌లోని తన కుమార్తె రేష్మా ఇంటికి వెళ్లింది.
READ MORE: MLC Kavitha: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే..
తన తల్లి సొంత అక్కను ఎక్కువగా ఇష్టపడుతుందని రేష్మ భావించింది. ఇద్దరి మధ్య చాలా కాలంగా మనస్పర్థలు ఉండేవి. ఈ కారణంగా తల్లి కూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్త తీవ్రమైంది. ఇంతలో రేష్మ వంటగదిలోంచి కత్తి తీసి తల్లిని పొడిచి చంపేసింది. తల్లిని హత్య చేసిన వెంటనే.. చునాభట్టి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి రేష్మను అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో అధికారులు విచారణ ప్రారంభించారు. రేష్మా మానసిక ఆరోగ్యంపై కూడా విచారణ జరుగుతోంది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారి వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు.
READ MORE: IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. ఆధిపత్యం చూపించిన ఆస్ట్రేలియా