Maharashtra: కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఫైలులో నుంచి బయటకు వచ్చిన విషసర్పం
- మహారాష్ట్రలో ఓ విచిత్రమైన ఘటన
- కోర్టులో బయటపడ్డ పాము
- కోర్టు గదిలో గందరగోళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఒక్కసారిగా విష సర్పం బయటకు వచ్చింది. కోర్టులోని ఫైళ్ల గుట్టలోంచి పాము రావడంతో కోర్టు గదిలో గందరగోళం నెలకొంది. కోర్టు హాలులో ఉన్నవారంతా పాము భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ముంబైలోని ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కోర్టు విచారణ సందర్భంగా.. కోర్టులోని రూం నంబర్ 27లోని ఫైళ్ల మధ్య దాదాపు 2 అడుగుల పొడవున్న పాము కనిపించింది.
READ MORE: Delhi: ఢిల్లీ అల్లర్ల నిందితుడి ఇంటికి ఎంఐఎం నేత.. ఎన్నికల్లో పోటీ చేస్తాడనే ప్రచారం..
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
పాము బయటకు రావడంతో సభా కార్యకలాపాలకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది. న్యాయమూర్తి కూడా తన కుర్చీని వదిలి నిలబడ్డారు. పాము బయటకు రాగానే కోర్టు గదిలో ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారని ఓ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయమూర్తి కోర్టు విచారణను కాసేపు వాయిదా వేశారు. పాము పట్టేవారిని పిలిపించి కోర్టు హాలులో వెతికినా ఫలితం లేకపోయింది. పాత ఫైళ్లను తొలగించి చాలా సేపు వెతికినా కోర్టు గదిలో పాము కనిపించలేదని లాయర్ తెలిపారు. గదిలోని రంధ్రం నుంచి పాము బయటకు వచ్చిందని భావిస్తున్నారు. అయితే కోర్టు ఆవరణలో పాములు కనిపించడం ఇదే మొదటిసారి కాదని న్యాయవాది తెలిపారు. సోమవారం కూడా కోర్టు గది కిటికీపై పాము కనిపించిందని చెప్పారు. రెండు నెలల క్రితం న్యాయమూర్తి ఛాంబర్‌లో పాము కనిపించింది. ఈ కోర్టు గది చుట్టూ చెట్లు, మొక్కలు ఉన్నాయని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు.
READ MORE: Indigo: రైలు అనుకున్నాడో ఏమో? విమానంలో తిరిగి ప్రయాణికులకు టీ అందించిన వ్యక్తి (వీడియో)
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు