Maharashtra: ఎంవీఏ కూటమికి బీటలు.. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన(యూబీటీ) నిర్ణయం
- మహా వికాస్ అఘాడీ కూటమికి బీటలు
- మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఉద్ధవ్ థాక్రే పార్టీ నిర్ణయం
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చీలికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమి దాదాపుగా చీలిపోయినట్లుగానే తెలుస్తోంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి పరిస్థితి మరింత దిగజారింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధానిలో ఆప్-కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నాయి. ఇటీవల బీహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే ఏర్పడిందని.. ఇప్పుడు దాని అవసరం లేదని.. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉండాలని సూచించారు. అలాగే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల కోసమేనని పేర్కొన్నారు.
తాజాగా మహారాష్ట్రలో అదే పరిస్థితి దాపురించింది. మహారాష్ట్రలో నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోరంగా వైఫల్యం చెందింది. దీంతో కూటమిలో చీలకలు మొదలయ్యాయి. లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఈ కూటమి మంచి ఫలితాలనే సాధించింది. 6 నెలలు తిరిగే సరికి అంతా రివర్స్ అయింది. అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ కూటమిలోని నేతల మధ్య పొసగడం లేదు. దీంతో కూటమి చీలిక దిశగా వెళ్తోంది.
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
ముంబై, నాగ్‌పూర్, థానేలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (యుూబీటీ) ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ శనివారం మీడియాకు వెల్లడించారు. దీంతో ఎంవీఏ ఐక్యతపై ప్రశ్నార్థకంగా మారింది. కూటమి కారణంగా పార్టీ కార్యకర్తలకు అవకాశాలు ఉండడం లేదని. సంస్థాగతంగా కూడా పరిస్థితులు బాగోలేదని.. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ముంబై, థానే, నాగ్‌పూర్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు, పంచాయతీ ఎన్నికల్లోనూ స్వతంత్రంగా పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సంకేతాలు ఇచ్చారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని.. ఓటమి తర్వాత కనీసం సమీక్ష చేసుకునేందుకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. దీంతో కూటమిలో నిరాశ, నిస్పృహలు ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ ఒంటరి అయింది. మిత్ర పక్షాలు సపోర్టు చేయలేదు. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కూడా కూటమి ఐక్యతగా లేదు. దీంతో దాదాపు కూటమి చీలిపోయినట్లుగానే వార్తలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మహాయుతి కూటమి 230 స్థానాలు గెలుచుకుంది. ఎంవీఏ కేవలం 46 స్థానాలతో సరిపెట్టుకుంది. శివసేన (యూబీటీ) 20,, కాంగ్రెస్ 20, ఎన్‌సీపీ (ఎస్‌పీ) 10 స్థానాలు గెలుచుకున్నాయి.
తాజావార్తలు
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..