Anant-Radhika Pre-Wedding Invitation Card Goes Viral: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. 7000 కోట్ల విలువైన లగ్జరీ క్రూయిజ్ షిప్లో 4 రోజుల పాటు గ్రాండ్గా ఫంక్షన్స్ జరగనున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా క్రూయిజ్ షిప్ ప్రయాణిస్తుంది. దాంతో అతిథులు యూరోపియన్, మధ్యధరా సముద్ర అందాలను బాగా ఎంజాయ్ చేయనున్నారు. అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్ బాష్కి సంబందించిన ఓ ఇన్విటేషన్…
ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి.
మాయానగరి ముంబైలో నిర్మించిన జియో వరల్డ్ గార్డెన్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దీని యజమాని దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ. ఈ గార్డెన్ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. చెరువులు, మాల్స్, థియేటర్లు, గార్డెన్లోని పచ్చదనం దాని అందాన్ని మరింత పెంచుతాయి. ఇందులో ఇప్పటికే పలు పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు.
Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె చేసిన రచ్చ.. ఇరుకున్న వివాదాలు అంతా ఇంతా కాదు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ మీడియా ముందు ఆమె చేసిన హంగామా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
Chiranjeevi: గత కొన్నిరోజులుగా దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న విషయం అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి. దాదాపు రూ. 1000 కోట్లతో ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. జూలై లో పెళ్లి జరగనుంది. పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో అనేది ఊహకు అందని విషయం. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. వారి కోసం ఎంతో శ్రమిస్తారు. తమ పిల్లలు ప్రయోజకులైతే ఆ పేరెంట్స్కు అంతకంటే సంతోషం ఏముంటుంది.
Disney Hotstar Merger : దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ త్వరలో అతిపెద్ద మీడియా కంపెనీల్లో ఒకటిగా అవతరించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య విలీన ఒప్పందం ఖరారైంది.
ప్రముఖ అమెరికన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ‘డిస్నీ ఇండియా అధినేత వాల్ట్ డిస్నీ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్నీ తన వ్యాపారాన్ని భారతదేశంలో కూడా విస్తరించాలని చూస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. టెలివిజన్తో సహా మొత్తం డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి పలువురు వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారని బ్లూమ్బెర్గ్ న్యూస్ నివేదించింది. ఇప్పటికే భారతదేశంలో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియాను కొనుగోలు చేసే రేసులో ఉన్నట్లు గతంలో…