ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రముఖ వ్యాపార వేత్త మఖేష్ అంబానీ కలిశారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జులై 12 న ప్రారంభం కానున్నాయి. ఈ వివాహానికి దేశా విదేశాల్లోని ప్రముఖులకు ఆహ్వాన లేఖలు పంపుతున్నారు. అదే సమయంలో, ముఖేష్ అంబానీ స్వయంగా కొంతమంది అతిథులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నివాసానికి ముఖేష్ అంబానీ చేరుకున్నారు. తన కుమారుడి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. కొద్ది రోజుల క్రితం ముఖేష్ అంబానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటికి చేరుకుని తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. కాగా.. అనంత్-రాధిక వివాహ ఆచారాలు కూడా జులై 3 నుంచి ప్రారంభమయ్యాయని తెలిసిందే. అనంత్, రాధికల మమేరు వేడుక నిర్వహించారు. ఈ సంవత్సరం మార్చిలో, రాధిక మర్చంట్, అనంత్ అంబానీల మొదటి ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించారు. దీని తరువాత, ఈ జంట రెండవ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ ఇటీవల ఇటలీలో జరిగింది.
READ MORE: Darshan Case: దర్శన్‌కి సుమలత మద్దతు.. హత్య చేసింది అతను కాదు.. సంచలన పోస్ట్!
మామేరు వేడుక అంటే ఏమిటి?
మమేరు అనేది గుజరాతీ వివాహ సంప్రదాయం. దీనిలో వధువు మామ (అమ్మ సోదరుడు) స్వీట్లు,బహుమతులు కానుకలుగా ఇవ్వడానికి ఆమెను సందర్శిస్తారు. సాధారణంగా పనేటర్ చీర, ఆభరణాలు, దంతాలు లేదా తెల్లని చురాను ఆమె మేనమామ వధువుకు ఇస్తారు. ఇది కాకుండా స్వీట్లు ,డ్రై ఫ్రూట్స్ కూడా బహుమతులుగా ట్రస్సో ట్రేలలో అందంగా ప్యాక్ చేయబడతాయి.