జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. శ్రీనగర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఇదే కేసులో గత నెలలో సమన్లు అందాయి.
Money Laundering Case : కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు మరోసారి విచారణకు పిలిచింది. నిన్న, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేంద్ర ఏజెన్సీ రాంచీలో 11 గంటల పాటు విచారించింది.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు చేరుకోగా.. ఆయన తన ఇంట్లో లేరని, ఎక్కడికో వెళ్లారని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పాట్నా కార్యాలయంలో హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. భూములు తీసుకుని.. బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలతో నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ ఇద్దరు నేతలను విచారించనున్నారు.
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిరంతరం దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజేగౌడతో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఉదయం సోదాలు చేసింది.
ED Raids: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. అక్రమ మైనింగ్ ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు రాంచీ, రాజస్థాన్‌లోని 10 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నాయి. జార్ఖండ్ సీఎం ప్రెస్ అడ్వైజర్ అభిషేక్ ప్రసాద్‌తో పాటు హజారీబాగ్ డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్ రామ్ నివాస్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. రామ్ నివాస్ ఇల్లు రాజస్థాన్‌లో ఉంది.
ఈడీ కేసులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పెద్ద చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించబడింది. ఛార్జిషీట్లో గతంలో రాబర్ట్ వాద్రా పేరును ప్రస్తావించారు.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన రూ. 90 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అలాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఢిల్లీ, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌజ్‌లు, లక్నోలోని నెహ్రూ భవన్ ఉన్నాయి. అసోసియేటెడ్ జర్నల్‌కి చెందిన జప్తు చేసిన ఆస్తుల విలువ రూ. 752 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు…