మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పాట్నా కార్యాలయంలో హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. భూములు తీసుకుని.. బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలతో నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ ఇద్దరు నేతలను విచారించనున్నారు.
Read Also: Lifestyle : అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిలను ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారో తెలుసా?
జనవరి 29న లాలూ ప్రసాద్, జనవరి 30న తేజస్వి యాదవ్ తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ పిలిచినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పాట్నాలోని లాలూ ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి అధికారిక నివాసానికి సమన్లు అందజేయడానికి ఒక బృందం వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో వీరిద్దరికి గత డిసెంబర్ లో సమన్లు జారీ చేసినా విచారణకు హాజరుకాలేదు. యూపీఏ వన్ ప్రభుత్వంలో లాలూ కేంద్ర రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణానికి పాల్పడ్డారనేది ఈడీ సమన్లు జారీ చేసింది.
Read Also: Gidugu Rudraraju: ఎల్లుండి పీసీసీ చీఫ్‌గా షర్మిలకు బాధ్యతలు.. కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు!
కాగా.. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ యాదవ్ ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా ఆయన వెంట ఉన్నారు. సమావేశం అనంతరం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, విభేదాల పుకార్లు గ్రౌండ్ రియాలిటీకి పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు.