Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సమగ్ర విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో పలు షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. న్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తీసుకువెళుతుండగా ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని చేర్చారు.
Today Stock Market Roundup 03-02-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం నష్టాలతో ముగిసింది. గ్లోబల్ మార్కెట్‌లోని ప్రతికూల పరిస్థితులు ఇండియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధానానికి సంబంధించి ఈ రోజు రాత్రి ఒక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత ప్రదర్శించారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీస్ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్, అవినీతికి పాల్పడినట్లు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
రైల్వేలో ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె చందా యాదవ్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు గురువారం నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రైల్వే భూముల కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు. తేజస్వి ఉదయం 11 గంటలకు విచారణలో చేరే అవకాశం ఉంది. ఇదే కేసులో మార్చి 25న తేజస్వీ యాదవ్ ను సీబీఐని ప్రశ్నించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడు ఆప్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది ఏప్రిల్ 12న అతని బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది.
ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కాన్మన్ సుకేష్ చంద్రశేఖర్ సహ ఖైదీలు, వారి కుటుంబాల సంక్షేమం కోసం రూ.5.11 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు అనుమతి కోరుతూ జైళ్ల డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. ఆఫర్ అంగీకరించబడితే, ఇది ఉత్తమ పుట్టినరోజు బహుమతి అవుతుందంటూ లేఖలో పేర్కొ్న్నాడు.
Jacqueline Fernandez: రెలిగేర్ మాజీ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్యను మోసం చేసిన మనీలాండరింగ్ కేసులో సుకేష్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాలీవడ్ యాక్టర్, సుకేష్ ప్రేయసి జాక్వలిన్ ఫెర్నాండేస్ కు లవ్ లెటర్ రాశాడు. ఆమెపై తనకున్న ప్రేమను ప్రేమలేఖలో వ్యక్త పరిచాడు.