నేషనల్ హెరాల్డ్” కేసు విచారణ వేగంగా సాగడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా చికిత్స కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణ కు సోనియా గాంధీ హాజరుకాలేకపోయారు. వైద్యులు అనుమతిస్తేనే ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరవుతారు. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈ రోజు (జూన్ 8) విచారణకు హాజరవ్వాలని సోనియా గాంధీకి నోటీసులు ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED). సోనియా గాంధీకి కరోనా సోకడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ రోజు కాకుండా,…
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్‌ను అరెస్ట్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. మంగళవారం 9 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత .. పూజా సింఘాల్ బుధవారం మళ్లీ విచారణకు హాజరయ్యారు.. ఇక, ఆమెకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలను సేకరించిన ఈడీ.. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసింది.. కాగా పూజా సింఘాల్.. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర గనులశాఖ కార్యదర్శిగా ఉన్నారు.. కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడటంతోపాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
మహారాష్ట్ర ప్రభుత్వంలోని నేతలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి.. వరుసగా జరుగుతోన్న ఘటనలు.. మొన్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్… నిన్న మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ జైలుకు పంపింది. తాజాగా ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించిన ఈడీ.. ఠాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్ ఫ్లాట్లను అటాచ్ చేసింది.…
ముంబై: టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా నటించిన సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు మనీ లాండరింగ్ కేసులో సచిన్ జోషికి చెందిన మొత్తం రూ.410 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ చర్యలు తీసుకుంది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ తెలిపింది. Read Also: వివాదంలో విరాట్…
బాలీవుడ్ మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్నవారందిరినీ ఈడీ విచారించింది. ఇప్పటివరకు సుఖేష్ సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వలిన్ పెర్నాండజ్ కూడా ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తనకు ఏమి తెలియదని, సుఖేష్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని విచారణలో తెలిపింది ఈ బ్యూటీ..…
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. అంతేకాదు సెప్టెంబర్ 25 వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. చీటర్ సురేష్ తో సంబంధాలపై జాక్వెలిన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఈడీ అధికారులు ఇదివరకే ప్రశ్నించగా.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్…
200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో ఆమె నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. కానీ ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని వారు వెల్లడించారు. నిందితుడు కన్హార్ సుకేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుండి కాలర్ ఐడి స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సంప్రదించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వర్గాలు మంగళవారం తెలిపాయి. సుకేష్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో…