మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను మార్చి 21న అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో మార్పు జరిగింది. తొలుత మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
క్యాష్ ఫర్ క్వారీ ఆరోపణలపై గతేడాది లోక్‌సభ నుంచి బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా(49)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది.
Money Laundering Case: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతరు చిక్కుల్లో పడ్డారు. సీఎం కుమార్తె వీణా విజయన్‌తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసినట్లు ఏజెన్సీ వర్గాలు బుధవారం తెలిపాయి.
Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేయలేదని, ఆయన జైలుకు వెళ్లినా.. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని పార్టీ చెబుతోంది.
Aravind Kejriwal : ఢిల్లీ వాటర్ బోర్డుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావడం లేదు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.