Karnataka: మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిరంతరం దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజేగౌడతో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఉదయం సోదాలు చేసింది. అయితే, కర్ణాటక అసెంబ్లీలో మలూరు స్థానానికి నంజేగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేవై నంజేగౌడ కోలార్-చిక్కబల్లాపూర్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అధ్యక్షుడు కూడా ఉన్నారు. అయితే, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) దర్యాప్తులో భాగంగా మలూరుతో పాటు కోలార్ జిల్లాల్లో వారి స్థలాలకు సంబంధించిన కొన్ని సంస్థలపై కూడా దాడులు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. స్థానిక పోలీసు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.