హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో 'ఉమెన్ ఇన్ మెడికల్ కాంక్లేవ్' ముఖ్యఅతిధిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. నేను డాక్టర్ కావాలని మా అమ్మ కోరుకుందని అన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ అధినేక కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే అవుతారని ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమర రాజా సంస్థ ముందుకొచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. పదేళ్లలో రాష్ట్రంలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టండంతోపాటు 4,500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది.
గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మునుగోడుకు మంత్రులు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు.