డిసెంబర్ 9న జరిగే మెట్రో రైల్ విస్తరణ శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణ పై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. నగర మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగం ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైలు విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆయన వ్యాఖ్యనించారు. శంకుస్థాపనకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డిసెంబర్ 9వ తేదీన శంకుస్థాపన వేసే ప్రాంతంతో పాటు కేసీఆర్ పాల్గొనే సమావేశ ప్రాంగణం వంటి వాటి ఏర్పాట్లను ఒకటి రెండు రోజుల్లో పూర్తి అవుతాయన్నారు.
Also Read : Mehbooba Mufti: ముస్లింలను దెయ్యాలుగా చూపించే ప్రయత్నమే “కాశ్మీర్ ఫైల్స్” సినిమా
ఇందుకు సంబంధించిన స్థలాల పరిశీలనకు రేపు మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలన చేయాలన్నారు. నగరంలోని ట్రాఫిక్, రక్షణ ఏర్పాట్లు, ప్రణాళికల పైన ఇప్పటినుంచే కసరత్తు చేయాలని పోలీస్ శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానున్న మెట్రో కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నగర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఇదిలా ఉంటే.. రేపు నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు అక్కడి పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Also Read : Gurajada Award To Chaganti: చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ప్రదానం